పుట:Srinadhakavi-Jeevithamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

శ్రీనాథకవి


మొవ్వ "రేవిధముగాఁ జెప్పిసను ఒకటి గెండు సంవత్సరముల భేదముతో సరిపోకమానసనియు, శ్రీ మాన్ కిలాంబి రాఘవాచార్యులు ఎమ్. ఏ. బి. ఎల్. గారు మఱోకమాఱు శద్ధతోఁ బరిశోధించిన యెడ వారు తెలిసికొనఁగలరని నాదృఢమైన విశ్వాసము. అట్లు చేయఁ బ్రార్థింతును . మీరు చేసిన గొప్పతప్పేయన మొదటి దేవరాయలు, రెండన దేవరా యలు లేక ప్రౌఢ దేవరాయలనుటకు మఱుగా ప్రథమ హరిహర రా యలు, ద్వితీయ హరిహర రాయని వ్రాయుటయే. ద్వితీయ హరిహర రాయలు క్రీ. శ. 1425--1446 సంవత్సరములలో రాజ్య మొనర్చినట్లు మొదట వ్రాసి తరువాత కిందను 'ద్వితీయ హరిహర రాయ లయినచో కవి క్రీ. శ. 1425 ప్రాంతము వాఁడగునని వ్రాయుట మఱియొక తప్పు. అళియ రామరాజు ముత్తాతయగు సోమభూపాలునకు శ్రీధర ఛందస్సు అంకితము చేయఁబడినదనుట మఱియొక తప్పు. అళియ రామరాజు ముత్తాత యార్వీటి బుక్క రాజు గాని సోమభూపాలుఁడు గాఁడు.

అళియ రామరాజు వంశము బాల భాగవతము నందును, నరపతి విజయము నందును దెలుపఁబడినది.

తాత పిన్నమరాజు కొడుకు సోమ దేవరాజు; వానికొడుకురాఘనరాజు; వానికొడుకు పిన్నమరాజు, వానికొడుకు బుక్క రాజు,వానికొడుకు రామ గాజు; వానీకొడుకు తిమ్మరాజు, వానికొడుకు శ్రీరంగరాజు; వానీకొడుకు అళియ రామరాజు. ఇట్లుండగా అళియరామరాజు ముత్తాత సోమభూపాలుడనుట తప్పు. అళియరామరాజున కేడు తరములకుఁ బూర్వమున్న వాఁడు సోమదేవ రాజు. ఈ సోమదేవ రాజే సోమభూపాలుఁ డనుకొంద మన్న సతఁడు క్రీ. శ. 1370 సంవత్సరమునకుఁ బూర్వుఁడు కాని తరువాత యుండఁడు. అతని కంకితము చేయఁబడిన 'శ్రీధర ఛందస్సులో 1450 ప్రాంతమున వ్రాయఁబడిన క్రీడాభిరామములోని మంచనవింటివో