నకు ఫలమని నీచకులము లేక నీచగుణము గలవారిని నీచముగా జూచి, క్రూరముగాను, అసూయతోను, గర్వముతోను నడచుకొనుట కాధారము కాదు. అట్లెవడైన నడచినయెడల తన యాత్మను నీచపరుచుకొన్నవాడగును.
ఆత్మ దేనిచేతను మారదు. అది ప్రత్యేకముగ నిలిచి
యుండును. ప్రకృతిగుణములే యెల్లచేష్టలను చేయుచున్నవి.
ఆచేష్టలచేత ఆత్మ మారుదల నొందదు. దాని స్వరూపమును
స్పష్టము చేయుటకు చెప్పినది. పాలలో మజ్జిగ
వేసినయెడల పెరుగగునట్లు, దేహముతోచేరిన యాత్మస్వరూపము
పాపపుణ్యములచేత మారిపోదు. "ప్రత్యేకముగా
నిలుచును." "మారుదల పొందదు" అనుదానివలన దెలి
యవలసిన దింతేకాని, యాత్మకు బాధ్యతలేదని చెప్పుట
కాదు. చేయుపనుల పాపపుణ్యఫలము నది పొందదనియు
కాదు.
స్వభావగుణములు జడప్రకృతియైన దేహమున నాటు
కొని యున్నను నవి యింద్రియములను మనస్సును తమ
యధీనమున నుంచుకొని, వానిమార్గమున నాత్మనుగూడ
బంధించి విడుచును. కాని, గుణములతో పోరాడి, గెలిచి,
బంధమునుండి తప్పించుకొనుట కాత్మకు శక్తియు స్వాతంత్య్రము
నున్నవి. దీనికి జ్ఞానమను సాధనము కావలెను.