ఈ పుట ఆమోదించబడ్డది
చేయవలసినపనిని విడుచుట తగదు. మోహముచేత దానిని విడిచిపెట్టుట తమోగుణముచే గలుగునని చెప్పు దురు. 18-7
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే౽ర్జున
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః.
నియమింపబడిన కర్మమును చేయునపు డిది చేయ
వలసినదని చేయుచు సంగమును, ఫలమును, గణింపక
యొకడు విడిచిపెట్టినయెడల నాత్యాగమే సాత్త్విక మన
బడును. 18-9
నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మా ణ్యశేషతః
యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీ త్యభిధీయతే.
దేహధారిచే పనులను మూలముట్టుగ విడిచిపెట్ట
వీలులేదు. ఎవడు తాజేయు పనులఫలమును విడుచునో వాడే
త్యాగి యనబడువాడు. 18-11
దీనినే బాగుగ స్పష్టముచేసి లోకనాధుని యనుగ్రహమునే నమ్మి, సకలమునతని కర్పణముగా చేయవలెనని క్రింద చూపిన శ్లోకములలో జెప్పబడియున్నది.
సర్వకర్మా ణ్య పి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయం.