ఈ పుట ఆమోదించబడ్డది
యం సన్యాసమితి ప్రాహు ర్యోగం తం విద్ధి పాండవ
న హ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన.
దేనిని సన్యాసమని అందురో యదియే యోగమని
తెలిసికొనుము. దీనిని పొందుటకు దీనిని చేసెదను, దానిని
పొందుటకు దానిని చేసెదను, యను తలపును విడువనివా
డెవడును యోగి కాజాలడు. 6-2
(15)
కర్మయోగమే సన్న్యాసము.
(గీత: అధ్యాయములు 5, 18.)
ఒకడు స్వార్థదృష్టిని, ఆశాబంధమును విడిచి, లోక
మంతయు నొకటే యనుజ్ఞానమును పొందినపిదప సకల
లౌకికకర్మలను చేసికొనుచునే యున్నను వాడు సన్న్యాసియే
యగును.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వ న్నపి నలిప్య తే.
యోగముతోగూడి యాత్మశుద్ధి నొందినవాడు, తన్ను
తాను గెలిచినవాడు జితేంద్రియుడు ఎల్లప్రాణులును తానే