దానిని ప్రేరేచు నుద్దేశమును బరిశుద్ధము చేసికొనినయెడల పాపమును, కర్మబంధమును మనలను చేరవు. ఇట్టి పరిశుద్ధ మైన యుద్దేశము గలిగి చేయుటయే జ్ఞానము.
యథైధాంసి సమిద్ధో౽గ్ని ర్భస్మ సాత్కురు తే౽ర్జున
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా.
బాగుగ మండుచున్న యగ్ని కట్టెల నెట్లు బూడిదగ
చేయునో, అట్లే జ్ఞానాగ్నియనునది ఎల్లకర్మములను కాల్చి
బూడిదగ జేయును. 4-37
నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
తత్స్వయం యోగసంసిద్ధః కాలే నా౽౽త్మని విందతి.
జ్ఞానమువలె పవిత్రమైన వస్తువు యీలోకమున
వేరేదియు లేదు. యోగములో బాగుగా నిలిచినవాడు తగిన
కాలమున నీజ్ఞానమును తనకు తానే పొందును. 4-38
యోగసన్న్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ.
యోగమార్గమును గొని తానుచేయు కర్మములందు
సంగమునువిడిచి, జ్ఞానముచే సంశయమును పోగొట్టుకొని,
తన్ను తానే కాచుకొనిన వానిని కర్మములు కట్టచాలవు. 4-41
తస్మా దజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనంసంశయం యోగ మాతిష్ఠోత్తిష్ఠ భారత.