ఈ పుట ఆమోదించబడ్డది
వర్ణములవారికిని శాఖలవారికిని గీత బోధింపబడుటకు ధనము మొదలయిన తృప్తికరములగు సదుపాయములు చేయబడిన వని నేను బ్రతికియుండగనే వినగోరుచున్నాను.
ఇది శ్రీకృష్ణునికి ప్రీతికర. మగుగాక!
- ____________
అనుబంధము 4.
గీత: జీవనమార్గము.
(డాక్టరు అనీబిసెంటు)
మహాభారతమను మహాకావ్యములో అమూల్యము
లగు బోధనలలో భగవద్గీతవలె అరుదైనదియు నమూల్య
మైనదియు మరియొకటి లేదు. యుద్ధభూమిలో శ్రీకృష్ణుని
ముఖమున నది బయలువెడలి తన శిష్యుడును సఖుడునునగు
నర్జునుని మనోద్వేగమును శాంతింపచేసినపిదప నెందరో
క్షుబ్దహృదయుల కది శాంతినిచ్చి బలపరిచినది, క్లేశము
ననుభవించు నెన్నియో యాత్మల నాతనిదరికి చేర్చినది.
కేవల కర్మఫలత్యాగమను సాధారణావస్థనుండి, కామము