నావిరతో దుశ్చరితా న్నా శాన్తోనానాసమహితః
నాశా న్తమనసో వా౽పి ప్రజ్ఙానే నైన మాప్నుయాత్.
చెడునడతను విడువనివాడును, మనస్సున శాంతము
పొందనివాడును, ఇంద్రియములను నణపనివాడును, ఆశతో
గూడిన కోరికలను విడువనివాడును, జ్ఞానమునొందినను ఆత్మను
కానచాలడు.
నియమము, ఇంద్రియముల నణచి యేలుట,
ఇంద్రియములను విషయములందు చరింపకుండ నిరోధించుట,
పనులను స్వలాభాపేక్షయు, సంగమునువిడిచి, భగవంతుని
కర్పణముగ చేసి ముగించుట, నభ్యసించుట, సుఖదుఃఖములను,
నింపుకంపులను, ఒకటేమాదిరిగ నెదురుకొనుట; ఈ
అభ్యాసములెల్ల అవిద్యను తొలగించుకొని యద్వైతమనో
భావములను పొందుటకు సాధనములు; మోహమునకును,
భేదబుద్ధికిని, చికిత్సాక్రమములు. వీనిని గైకొనక విషయముల
ననుభవించుటయం దాశగలిగి ఉన్నచో, బ్రహ్మమును,
జీవుడును ఒకటను సత్యజ్ఞాన మొకనాడును ఉండజాలదు.
పథ్యములేకుండుటచేత వ్యాధి యధికమగునట్లు, రానురాను
మైకమును, భేదబుద్ధియు అధికమగును. గ్రంథములనుండి
తెలిసికొనినమందు పథ్యములేక గుణమునివ్వజాలదు.
చిత్తరువునకును, జీవమనుష్యునికిని నుండు వ్యత్యాసమును పోలి
యుండును.అప్పుడే యుపయోగములేని జ్ఞానమునకును,