ఒక్కటిగనే తోచును. అనగా ఈఇద్దరిలోను ఆతడు వాసుదేవుని చూచును. మనుష్యులలో శ్రేష్టుడు, నీచుడు అనువ్యత్యాసము తొలగిపోవును. ప్రాణులఅంగవ్యత్యాసములుకూడ జ్ఞానమునొందినవాని కంటికి వ్యత్యాసముగతోపవు. ఎద్దు, ఏనుగ, కుక్క, కుక్కనుతినువాడు, విద్యావినయములు గల బ్రాహ్మణుడు, వీరిలో అవయవములకూర్పు మొదలగు సకల వ్యత్యాసములు అతని దృష్టిలో తొలగి అంతయు నొక్కటిగా తోచును.
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః
తేషా మాదిత్యవ ద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం.
అజ్ఞానము ఆత్మజ్ఞానముచే నడచినవారి జ్ఞానము
సూర్యునివలె ప్రకాశించి పరమాత్మను చూపించును. 5-16
విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః.
విద్యయు వినయమును గల బ్రాహ్మణుని, గోవును,
ఏనుగును, కుక్కను, కుక్కను తినువానిని, జ్ఞానమునొందిన
వారు సమదృష్టితో చూతురు. 5-18
యధా భూతపృథగ్భావ మేకస్థ మనుపశ్యతి
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్య తే తదా.