మనశ్శాంతి, సౌమ్యస్వభావము, మౌనము, ఆత్మవినిగ్రహము, భావశుద్ధి, ఇవిమనస్సుతోచేయబడుతపస్సు. 17-16
దానమును ఇట్లే. ఏ యుద్దేశముతో చేయుదుమో
దాని ననుసరించి, విభజింపవచ్చును. ఇవ్వవలె ననుకర్తవ్యము
గమనించి, వినయముతో మనస్సున ప్రతిఫలమున
కెదురుచూడక యిచ్చునదే శ్రేష్ఠమైనదానము. పుణ్యాశతో
యిచ్చుట కూడ రెండవ పక్షమే.
దాతవ్య మితి యద్దానం దీయ తే౽నుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతం.
ఇచ్చుట కర్తవ్యమని తెలిసి, ప్రతిఫలమును గోరక,
తగినస్థలమును, పాత్రమును, కాలమును, చూచి చేసిన
దానము సాత్త్వికదాన మగును. 17-20
యత్తు ప్రత్యు పకారార్థం ఫల ముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్రాజస ముదాహృతం.
ప్రతిఫలమును కోరియో, ఫలము నుద్దేశించియో,
మనస్సున కష్టముతోనో ఇవ్వబడిన దానము రాజసదాన
మగును. 17-21
అ దేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే
అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతం.
తగనిస్థలమున తగనికాలమున, తగనివారికి చేయబడు