భోగములను తృప్తిపొందించుకొనుటయందే యాసక్తి గలిగి, యిదియే పురుషార్థమని నిశ్చయించుకొని, 16-11
ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః
ఈహంతే కామభోగార్థ మన్యాయే నార్థ సంచయాన్.
వందలకొలది నాశాపాశములచే కట్టువడి, కామమునకును,
క్రోధమునకును నాటపట్టులై, కామభోగమునకై
యన్యాయముచేయుచు, ధనము మొదలగువస్తువులను చేర్చు
కొనకోరుదురు. 16-12
నేడు లోకమునగల స్థితి యిదియే గదా ! ప్రత్యేక
మనుష్యులయాశలును, చేతలును, జాతికూటములదృష్టులును,
ఇట్లే యుండుచు వచ్చుచున్నవి. ఈశ్వరునిమరచిన నాగరికత
మున్ముం దెట్లుండు ననుదాని నింకను చూడుడు.
ఇద మద్య మయా లబ్ధ మిమం ప్రాప్స్యేమనోరథం
ఇదమస్తీ దమపిమే భవిష్యతి పునర్ధనం.
అసౌ మయా హతశ్శత్రు ర్హనిష్యే చాపరానపి
ఈశ్వరో౽హ మహం భోగీ సిద్ధో౽హంబలవాన్ సుఖీ.
ఇప్పు డీలాభము నొందితిని. ఇకముం దీలాభమును
పొందుదును; ఈవస్తువును పొందితిని, ఇంకను నాకు ధనము
లభింపగలదు. 16-13