పుట:Sri Ramayanamu Sundara Kanda Katta Varadaraju 1952 251 P 2030020024835.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాండ రచనా ప్రస్తావగ మాత్రమే యీ పీఠికయందు చేయు చున్నాడను.

సుందరకాండము రామాయణమునఁ బ్రధానత్వమునుబడ యుటకనేక కారణములుగలవు. హనుమంతుఁడు సీతాసందర్శనముచేఁ గృతకృత్యుడయ్యెను గాన నా కాండమును బారాయణము చేసిన నట్లేకృతకృత్యులగుదురని కొందఱి భావము. అది నిశ్చయమే. హనుమంతునంతటి భక్తునకుఁ గృతకృత్యత గల్గుటలో లోపమెంతమాత్రమునుండదు. చాలమంది యాపత్సమయముల సుందర కాండమునే పారాయణము చేయుదురు. ఇతర కాండములట్టవి కావని కాదు. ఇది యుత్తమోత్తమమును వారి భావము నకు కారణముపైన వివరించినట్టు లేయని యెఱుంగునది. శ్రీరామజనన సత్కథాభూషితమగు బాల కాండ మట్టిది కాదా యని ప్రశ్నింపరాదు. గతాను గలిక న్యాయము మఱుపునకు రాఁగూడదు. హనుమన్మంత్రములో సుందర హనుమన్మంత్రము గలదు. ఆ మంత్రము హనుమన్మంత్రములోఁ బ్రధానము. ఆ మంత్రము నుపాసించుచుఁ దల్పౌరుష చిహ్నమగు సుందర కాండమును 'భారాయణము చేసిన చో శీఘ్ర ఫలప్రదమని ప్రాజ్ఞులైన పెద్దల యభిప్రాయము. మంత్రాధి కారము లేనివారుకూడ నీ సుందర కాండమును బారాయణము చేయుటగలదు. నిశ్చల భక్తి భావనతో నట్లు పారాయణము చేసిన యా హనుమంతుఁ డే శ్రీ రామచంద్రు నానతిని సకలపురుషార్ధములును సమకూర్చును.

ఇంతేకాక నీకాండమున స్వభక్త ప్రతిరూపమున స్వమహిమా ప్రదర్శన మనువదింపఁ బడినది. భక్తునకు నచంచల భావనయున్న కార్య సాఫల్యమగునని నిరూపితమైనది. కవితా