ఈ పుట ఆమోదించబడ్డది
కట్టా వరదరాజకృతమగు
శ్రీరామాయణము
(ద్విపద)
కిష్కింధాకాండము
శ్రీరాజితశుభాంగ ! - చిరగుణిసంగ
హారికృపాపాంగ! - యలమేలుమంగ
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ! - శ్రీ వేంకటేశ!
అవధారు కుశలవు - లారామచంద్రుఁ
డవధరింపంగ రా - మాయణంబిట్లు
వినుపించు తత్కథా - వృత్తాంతమెల్లఁ
గనుపించు నవ్వలి - కథ యెట్టులనిన
-: శ్రీరాముఁడు వసంతాగమ శోభితమైన పంపాసరస్తీరమునుగాంచి,
సీతావియోగభరమును తాళఁజాలక లక్ష్మణునితోఁ
దత్తీరవర్ణనఁగావించి ప్రలాపించుట :-
ఆ రాఘవుఁడు పంప - నందముల్ నింప
చేరికన్ గొని తన - సీతావియోగ