పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.


మదరాసురాష్ట్రీయ ప్రభుత్వమువారి సమాదరణమునఁ బ్రథమమునఁ బ్రకటితమైన తెనుఁగు గ్రంథములలో వరాదరాజ కృతియగు ద్విపద రామాయణమునందలి బాల, అయోధ్యా కాండములుగల ప్రధమసంపుట మాంధ్రమహాజనులనెల్ల నాక ర్షించినది ఈ గ్రంధము తంజావూరి శ్రీ శరభోజీ సరస్వతీమహలు గ్రంధాలయము వారి పక్షమునఁ బ్రకటితమైనది. అపూర్వాంధ్ర , గ్రంధములకు పెన్నిధియగు నీ తంజావూరి మహాలు గ్రంధాల యమువారి "తొలికానుక"గా పత్రిక లీ రామాయణభాగమును ప్రశంసించిన పరిశోధకులును పండితులును, భాషావాఙ్మయ విశారదులగు ప్రశస్తవిద్వాంసులెల్ల గ్రంధప్రకటనముఁ గొని యాడిరి.

ముందు తెలిపినటులుగా ప్రథమసంపుటము ప్రకటితమైన తోడనే ప్రభుత్వసహాయమున నీ గ్రంధమున మిగిలిన కాండము లను ముద్రించుటకుఁ బూనుకొని, తంజావూరి సరస్వతీ మహలు గ్రంధాలయము వారు, అరణ్య కిష్కింధా కాండములొక సంపుటముగను. సుందర కాండమొక సంపుటముగను, యుద్ధ కాండమొక సంపుటముగను మొత్తముమీఁద నాలుగు సంపుట ములుగా వెలువడఁజేయుటకు తీర్మానించిరి వానిలో అరణ్య కాండ,కిష్కింధా కాండములుగల ద్వితీయసంపుటమిది సుందర కాండ,యుద్ధకాండ సంపుటములు వెనువెంటనే వెలువడగలవు.