Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82


మ. వసుధాధీశ్వర ! నీవు మర్త్యతనువున్ వెర్జించి నిశ్శోకమై

వ్యసన చ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు స

ర్వసమత్వంబునఁ జేరు నంతకు భవద్వాక్యంబులన్ వించు నే

దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్. (509)


వ. అని యిట్లు పక్షపాత శూన్యంబులును మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు మూఁడులోకంబులకు నవ్వలి దైన సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునన్ దేజరిల్లుచున్న ఋషులం జూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూహలుండై నమస్కరించి యిట్లనియె . (510)


క. ఏడుదినంబుల ముక్తిం, గూడఁగ నేరీతి వచ్చు గురు సంసార

క్రీడన మేక్రియ నెడతెగుఁ జూడుఁడు మా తండ్రులార ! శ్రుతివచనములన్. (511)


శా. ప్రాప్తానందులు బ్రహ్మబోభన కళాపారీణు లాత్మప్రభా

లిప్తాజ్ఞానులు మీరు లార్యులు దయాశుత్వాభిరాముల్ మనో

గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా !

సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిన్ జర్చించి భాషింపరే. (512)


వ. అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ ప్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున. (513)

శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

సీ. ప్రతినిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిఁ జుక్క వెలుపల మఱుచువాఁడు

కమలంబుమీఁది భృంగములకైవడి మోముపైన నెఱపిన కేశపటలివాఁడు

గిఱివ్రాసి మాయ నంగీకరించనిభంగి వసనంబు గట్టక వచ్చువాఁడు

సంగిగాఁడని వెంటఁ జాటు భూతములు నా బాలుర హాసశబ్దములవాఁడు

తే. మహిత పద జాన జంఘోరు మధ్య హస్త, బాహు వక్షో హళానన ఫాల కర్ణ

నాసిగా గండమస్తక నయనయుగళుఁడైన యవధూతమూర్తి వాఁడరుగుదెంచె. ( 514)


ఉ. ఈరసలోకులం గినిసి యెగ్గులు వల్కనివాఁడు గోరికల్

గోరనివాఁడు గూటువలఁ గూడనివాఁడు వృథాప్రపంచమున్

జేఱనివాఁడు దైవగతఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై

నేఱనివాని చందమున నేర్పులు సూపెడువాఁడు వెండియున్. (515)