పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


75 పిల్లలమఱ్ఱి పినవీరన్న

వాణీకటాక్షము నందిన మహాకవివితంసులలో నగ్రగణ్యు డగు నితడు అవతారదర్పణము, నారదీయపురాణము, మాఘమహాత్మ్యము, మానసోల్లాససారము, శకుంతలాపరిణయము, జైమినీభారతము అను గ్రంథములను రచియించి వాసి గాంచియున్నవాడు. ఈతనిరచనములలో దుది రెండుపుస్తకములు దక్క తక్కినవి నామమాత్రాన శేషము లైనవి. ఆగ్రంథము లింతవరకు బయలుపడకపోవుట యాంధ్రులదురదృష్ట మనిచెప్పవచ్చును.