పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురా ణ ము


కలదోకఁ డంగలూర నెడి గామము మా గుడిపొడ సీమ లో
పల బహుపండిత ప్రకర భానుర మై కవిరాట్సమాజ సం
కలితమునై యనేక బుధకాండ విరాజిత మంది రాళియై
విలసిత కమ్మవంశ పరివేష్టితమై దివిముట్టి వెల్గుచున్

సంగీత నవుణీ భంగికి నీయూరె
     యావాసమన వేంకటాద్రి సాక్షి
సంస్కృత సాహితీ సంపత్తి కీ యూరె -
     దండనాఁ బురుషోత్తముండు సాక్షి
రమణీయకవి కీ గ్రామంబె మనికి నా
     నుడికి గోపాల కృష్ణుండు సాక్షి
శతవధానవిధానచాతురి కీ యూరె
     నిక్కయని వచింప నేనె సాక్షీ

గణితశాస్త్రకూలంకష జ్ఞానమునకు
స్థాన మియూరసంగ రత్న మ్ము సాక్షి
కమ్మవంశంబు పతిభా పగల్బమనుట
కింతమంది యంత ర్వాణు లెల్ల సాక్షి


పండిత ప్రకాండ కవీశ బహుళ గాన
గణితశాస్త్రజ్ఞ పౌరాణిక ప్రధాన
వంతమై యిందు వెల్గొందు మంతు కెక్కి
త్రిఫుర నేన్యస్వవాయము దీర్ణ మహిమ,

60