పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్త మా నము


విద్య సామాన్యమయినది. కులానుకూల ధర్మనిర్ణ యముపై బ్రాహ్మణేతరలోకము దాడి వెడలినది. ధర్మ సంగ్రామమగుటచే విజయలక్ష్మీ కరుణాపాంగ వీక్షణములు బ్రాహ్మణేతరలోకము పయిఁ బ్రసరించుచున్నవి. నిద్రావస్థ దొరలాడుచున్న బ్రాహ్మణేతరుఁడుత్థితుఁడై నడుము కట్టికొని రణరంగమున కురుకుచున్నాడు. అఱన దేశంబున 'ద్రావిడ సంఘములు”, తెలుగు దేశంబున ‘బాహ్మణేతర సంఘం బులు', మహారాష్ట్ర దేశంబున 'సత్యశోధకపంధ, వంగ దేశంబున కాయస్థుల తిరుగు బాటు, పాంచాలాది రాష్ట్రంబుల 'ఆర్యసమాజముహీందూమహాసభ' ఏకముఖంబునఁ బౌరాణికులు ప్రతిష్టించిన విశేషధర్మ నిర్మూలమునకై యత్నించుచున్నవి. ఇవి యన్నియుఁ బెక్కుశతాబ్దులనుండి శుష్కించి, శుష్కించి జీవచ్చవమై యున్న హిందూసంఘ శరీరమునకు జీవకళలు, ఇక 'హిందూసంఘము సర్వాంగ సుందరముగా జీవింపగలదు. మతాంతరులను, జాత్యంతరు లను హిందూసంఘముస లయింపఁజేయుట చేతను, జండాలాది నిమ్న జాతులకు సత్వము లొసంగుట చేతను, మరల భారత ఖండంబున సర్వసౌభ్రాతృత్వము నెలకొల్పి దుండగీండ్ర వాతంబడి మరణించిన శ్రాద్ధానందస్వామి మృతజీవుడయ్యెను.


39