పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రేతా యుగము


యయ్యెను. ఐహిక ఫలాపేక్షచే దపస్సు చేయుటకుఁ దోడుగా సాముష్మిక చింతచే నా మరణానంతము తపస్సు నందు లీనమై యుండుట తటస్థించుచుండెను. ఆశ్రమపద్ధతి విరివిగా సవలం బిపఁబడుచుండెను. సంసారసంబంధంబులు వృద్ధికాజొచ్చెను. స్త్రీలు సర్వ స్వతంత్రురాండ్రు కారను నూహ యుత్పన్నము కామొదలిడెను. జననీజనకులు వధువును నా మెయభిప్రాయ మడుగకుంఅడ వరునకిచ్చుట పొసగుచుండెను. [1]+ అధిష్టాన పురాధి నేత యగు యయాతి తన కుమారితను, దారుణ్య లావణ్యముకలదాసని మాధవి యను కన్యను గాలవుఁడను బ్రాహ్మణుఁ డొక్కఁడు గుఱ్ఱముల కై యాచింప, నా బ్రాహ్మణుడు కోరిన గుర్రములు తనవద్ద లేనింజేసి, యితరులకడం గుదువ బెట్టి గుర్రములను దెచ్చికొనుటకై సమర్పించెను.. గాల పుఁ డామెను గైకొని, క్రమక్రమముగ మూవుర రాజులకు నిచ్చి, యొక్కొక్క-పుత్రుఁడు కలుగు వరకు నుంచి, వలయు హయరత్నములంగొని, కడకు సుదతీరన్నముఁ గూడఁ గైకొని తన గురువగు విశ్వామిత్రునకు నశ్వములతో బాటు మాధ వినీగూడ గురుదక్షిణగా నొసంగెను. దీన మాధవీ కన్యా త్వము దూషితము కాలేదు. కైవల్యము నపేక్షించి . యడవు లంబట్టి యుస్న ఋషులు లౌకిక వ్యాపార రతులై రాజసమ్ము ఖమునకు ముఖములం ద్రిప్ప నారంభించిరి. గాంధర్వ రాక్షస

....................................................................................................................................


+.

33

  1. మాధవియందె ఇక్ష్వాకునకు, వను మనస్సు జనిం చెసు, దివోదాసు నకు ప్రవర్ధనుఁడు ప్రభవించెను. ఔశీనరునకు శిబిపు పుట్టెను, {భారతము.)