పుట:Shrungara-Savithri-1928.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

49


ర్వత్ర యొసంగి దేవికృపవల్ల జనించుట నామెపేరె సా
విత్రి యటంచుఁ బే రిడి భువిన్ బెరుఁగన్ బెనుపొందె బాలయున్.


ఉ.

బోటులతోడఁ దోయములు బొమ్మలపెండ్లియుఁ బుట్టచేండ్లుఁ గో
లాటము [1]నమ్మనమ్ము లరుగాటలు గుజ్జనగూండ్లుఁ దాటిచె
ట్లాటలు నిద్దఱాండ్ల మగనాటలు వెన్నెలగుప్ప డాఁగిమూఁ
తాటలు నాది గాఁగలుగు నాటల నాడుచు నుండె వేడుకన్.


క.

ముద్దించి తల్లిదండ్రులు
విద్దెలు నేర్పింప సకలవిద్యలు వచ్చెన్
ముద్దియకుఁ బచ్చవిలుకాఁ
డద్దిర యన మెచ్చ వచ్చె యౌవనమంతన్.


సీ.

పున్నమనాఁటి సంపూర్ణచంద్రునిరీతి
                 కళలు దేరగ సాగెఁ గలికిమోము

  1. చెమ్మ చెక్క