పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

ఈసంజయుఁడు సభలయందును, ఒంటరిగ ధృతరాష్ట్రునితోను ననేకపర్యాయములు జంకక ధారాళముగను యుక్తి యుక్తముగను జెప్పియున్నాఁడు. ఇట్టివాఁ డగుటవలననేకదా, ధర్మరాజు యుద్ధానంతరము తనరాజ్యకాలములో నితని నొక మంత్రిగ నుంచుకొని యుండెను.

15. దుర్యోధనుఁడు.

ఇతఁడు ధృతరాష్ట్రుని జ్యేష్ఠకుమారుఁడు ఈభారతయుద్ధమున కీతనితండ్రి యెంత ప్రధానుఁడో యితఁడును నంతకు నెక్కుడు ముఖ్యుఁడై యున్నాఁడు. మరియు మత్సరబుద్ధితో ననేక దుష్కార్యములు చేసెను. సంకల్పసూర్యోదయ మనుగ్రంథమున గామక్రోధాదిగుణములను బురుషులనుగా దీసికొనినట్లు భావించినచో నీతఁడు మత్సరస్వరూపుఁ డనియే చెప్పవచ్చును. ఇతనికి బాల్యమునుండి భీమునియందు ద్వేషము హెచ్చుగ గలిగియుండెను. అతనినిఁ జంపుకొరకు నీళ్లలోఁ ద్రోయించెను. విషము బెట్టించెను. ఈవిధముగ బగఁ దీర్చికొనుట బహుదుష్టబుద్ధి గలవాఁడే కాని తదితరుఁడు చేయఁబూనఁడు. తనతండ్రి ధర్మరాజును యౌవరాజ్యమున నభిషేకించినపిదప నతని యందును దక్కినపాండవులయందును నితనికి నసూయ హెచ్చెను. అదిమొదలు పాండవులను రూపు మాపుటకు నా జన్మాంతము బ్రయత్నింపుచునె వచ్చెను. ధర్మరాజు యువరా