పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

నని నమ్మి యతఁడు హిరణ్యకశిపుఁ డనురాక్షసుని నారూపముతో సంహరించినట్లును, బ్రహ్లాదుని రక్షించినట్లును గథను గల్పించిరి. ఈ హిరణ్యకశిపుడుండుచో టెచ్చటనులేదు. ఇతఁడే యట్టి గొప్పప్రసిద్ధి గలప్రభువై యుండినచో నాస్థల మిప్పటికిని నిర్దేశ్యము గాదగి యుండవలసియుండును. ఈ ప్రహ్లాదచరిత్రము కల్పితకథయై యుండును అయినను నిందు గ్రహింపఁదగినయంశములు మూడుగలవు : 1. భక్తికి బ్రహ్లాదుని చారిత్రమును, 2. ఎంతతపస్సుచేసి యెన్నివిధముల బ్రాణసంరక్షణముకొరకు వరములను బొందియున్నను యుక్తప్రవర్తనము లేనివాఁడు హానిని జెందునను నీతికి నితనితండ్రి చరిత్రమును, 3. సర్వశక్తికిని భక్తులను రక్షించుటకును నృసింహ వృత్తాంతమును మనము ముఖ్యముగ గ్రహింపవలెను. ఈకథను నిజముగ జరిగినదానినిగ నమ్మియుండుటచే మనదేశమున ననేక దేవాలయములయందు సింహముఖముగల విగ్రహము లారాధింపం బడుచున్నవి.

మఱియు శంకరరామానుజాచార్యులు కార్యసిద్ధికొఱకును, శత్రుక్షయముకొఱకును నృసింహమూర్తిని గొలిచినట్లున్నది. నరసింహశబ్దమున కర్థము నరుఁడుగ నవతరించి పరాక్రమముఁ జూపిన భగవంతుఁడని కదా? నరరూపమునుఁ దాల్చిన రామకృష్ణులు పరాక్రమవంతు లయియేకదా రావ