పుట:ShivaTandavam.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవశిరోభేదములు[1] నవకంబుగాఁ జూపి
భవురాణి యష్టగుణభావదృష్టులు[2] మోపి
పదిరెండుహస్తములు[3] బట్టి, మదిరాక్షి మఱిఁ
బదిలంబుగాఁగ గ్రీవాభేదములతోడ

ఆడినది గిరికన్నె యలసమారుత మట్లు
బాడినది సెలకన్నె పకపకా నవ్వినటు
లాటపాటల తోడ నవశులై బ్రహ్మర్షి
కోటులెల్లెడ నమిత జూటులై సేవింప

శరదబ్జధూళిపింజరితముల చక్రముల
సరిదూగు లావణ్యభరిత కుచయుగ్మములు
చనుకట్టు నెగమీటి మినుఁ దాకునో! యనగ
వనజాక్షి, పై పైని వక్షమ్ము విరియించి
                        యాడినది గిరికన్నె

ఒకవైపు భ్రూభంగ మొదిగించి చూచినది
వికచసాకూతముగ విశ్వేశ్వరుని లలిత

  1. సమము, ఉద్వాహితము, అధోముఖము, అలోలితము, ధ్రు కంపితములు, పరావృత్తోతిప్తములు, పరివాహితము.
  2. సమము, అలోకితము, సాచి, ప్రలోకితము, నిమీలితము, ఉల్లోకితము, అనువృత్తము, అవలోకితము, దృష్టులు.
  3. ఇచ్చట హస్తశబ్దము హస్తప్రాణముల కౌపచారితము, హస్త ప్రాణములు పదిరెండు. ప్రసారణ, కుంచిత, రేచిత, పుంఖిత, అపవేష్టితక, ప్రేరిత, ద్వేష్టిత, వ్యావృత్త, పరివృత్త, సంకేత, చిహ్న, పదార్థటీకలు.