Jump to content

పుట:ShivaTandavam.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

నీలసూత్రము[1] లోన నిక్కి యర్రులుసాచి
కూలంకషమ్ముగాఁ గూయు జిఱుగజ్జియలు
జిలిబిలి పదంబులను పలుకు నొక్కకసారి
కలకలమటంచు నవ్వులు జిల్కు నొకసారి
చెలువంబు వడబోసి చిఱు నవ్వు నొకసారి
కొలఁదిమీఱంగ ఫక్కున నవ్వు నొకసారి
మూఁగసైగలతోనె మురిపించు నొకసారి
రాగాలపనమందు రణియించు నొకసారి

ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

జననాంతరంబులో సంసక్తమయి వచ్చి
మనసులోతుల నిల్చి, మాటాడువాసనలో!!
యమృతమయమై యాత్మనంటిన సుషుప్తిలోఁ
గమముగా గప్పు నిర్జరమహచ్ఛాయలో!!
ప్రమదంబె రూపెత్తు బంగారుకలలలో
నమరకాంతలు సేయునట్టి కనుసైగలో!!
యన సూక్ష్మతమముగా, నటు సూక్ష్మతరముగా
వినఁబడియు, వినఁబడనివిధిగ మువ్వలు మ్రోఁగ

  1. పాదముల యందలి గజ్జెలు నీలసూత్రమునకే గూర్చవలెనని యాచార్యమతము.