పుట:Shathaka-Kavula-Charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(vi)


శ్మీరదేశపుఁగవి తారాదేవినిఁగూర్చి స్రగ్ధరాస్తోత్రము వ్రాసెను. (panegyric). దీనికే "ఆర్యతారాస్రగ్ధరాస్తోత్ర” మని మారుపేరు. "స్రగ్ధర ” యనఁగా హారధారిణి. ఈపేరు తారాదేవికిని, శ్లోకనామమునకుఁగూడఁ జెందును. కవి యెనిమిదవశతాబ్దమువాఁడు. కాశ్మీరరాజున కల్లు:డే కవి యని తారానాథుఁ డనుచున్నాఁడు. ఒకప్పు డీతఁడు దాతయై యొకనరమేధ మొనరింపఁ బూనుకొనినరాజున కమ్ముడువోయి విప్రుని విడిపించి సంతోషపెట్టి, తాను "ఆర్యతారానామాష్టోత్తర శతస్తోత్రము” వ్రాసి తాను ప్రాణభయమునుండి తప్పించుకొని నూఱుమంది రాజకుమారుల ప్రాణముల రక్షించెను. ఈ 108 శ్లోకములును తారాదేవి నామగుణవర్ణనమే. ఆమెస్తుతియే!


ఏకవింశతిస్తోత్ర మనునది మఱియొక గ్రంథము.

ఇవి యన్నియుఁ బాశ్చాత్యులు భాషాంతరీకరించుకొనిరి. శాలివాహనసప్తశతి మనశ్రీనాథుఁడు భాషాంతరీకరించినను మనకుఁ జిక్క,లేదు[1]. ఈనడుమ శ్రీరాళ్లపల్లి యనంతకృష్ణశర్మగా రాంధ్రపత్రిక సారస్వాతానుబంధమున రుచిఁజూపినయాగ్రంథము మనకులేకపోవుట యెంతనష్టమో తెలిసినది. పాలి, ప్రాకృతముల మనవా రభ్యసించి యందలిగ్రంథము లెన్నియో భాషాంతరీకరించుకొనవలసియున్న దని వేఱుగఁ జెప్ప నగత్యములేదు.

చంద్రగోమి యనుమఱియొకకవి తారాసాధనశతక మొకటి వ్రాసెను. ఇట్లే తారాదేవిపై శతాధికస్తోత్ర కావ్యములు పుట్టినవి.

  1. ఈక్రిందిపద్య మొక్కటిమాత్రము శ్రీనాథుని దని శ్రీమా రామకృష్ణకవిగా రనుచున్నారు.

    ఉ. వారణసేయదావగొనవా నవవారిజమందుఁ దేఁటి క్రొ
         వ్వారుచునుంట నీవెఱుఁగవా ప్రియహా తెఱగంటి గంటి కె
         వ్వారికిఁ గెంపురాదె తగవా మగవారలదూఱ నీవిభుం
         డారసి నీనిజం బెఱుఁగు నంతకు ------- నోర్వు నెచ్చెలి.