గద్వాల
57
తే.గీ|| శిష్టులకు సభయదమయి చెలఁగునెద్ది
కంకణాలంకృతం బయి కాంతి చెందు
సిద్ది శ్రీరామభూపాలు ముద్దుతనయు
కరము సద్దాని వర్ణింపఁ గలమె మేము 3
శ్రీ. శ్రీ. శ్రీ.
దుర్ముఖి సం॥ జ్యేష్ఠములో నర్సాపురములో జరగిన శతావధానములోఁ జెప్పిన 69 పద్యములలోఁ గొన్ని పద్యములు
శంకరాచార్యులు.
సీ||అడఁగించె నివ్వాఁడు కడ లేని మోహాంధకారము దివ్య జ్ఞానక లన
స్థాపించెనెవ్వాఁడు షణ్మతమ్ములను బౌద్ధాది దుర్మతముల హతము చేసి
రచియిం చెనెవ్వాఁడు బ్రహ్లాదులకశక్య మైన శ్రీసూత్రభాష్యాదికంబు!
నిర్జించే సెన్వాఁడు నిర్జర జ్యేష్ఠావ తారుఁ డై నట్టివిద్వాంసునొకని,
తే| గీ॥ నట్టియస్మన్మతత్తారణార్య బిరుదు
నవరసాంబశి వావతారాడ్యు బ్రమ
బోధపారీణు నానందపూర్ణు ససఘు
శంకరాచార్య వర్యుని సంస్మరింతు||
పరమేశ్వరుఁడు
ఉ॥ ఏమహనీయు ప్రాభవము నెట్టి మహాత్ములునై న జెప్పలే
రేమహనీయు తేజమున కెంతటి వారును నిల్వ నోవ రిం
కేమహనీయువర్ణ నము నెంతటి వారును జేయఁజాల రే
నామహనీయు నెంతుఁ బరమాత్ముని విఘ్న వినాశశీలు నిన్2
........................................................................................................
Sanscrit and Telugu vere of different metres. I was much pleased with the skill in versification and the wonderful power of memory displayed by the two Pandits,
(Stamp of Rajah in Parsbi.)
Rajah of Gadwal Samstan
}