పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
శశికళ
38
 

మసృణ కోమల కరము
ఘుసృణ పరిమళ స్పర్శ

        నాకు ప్రాణము నిచ్చె
        నాకు మెలకువ వచ్చె

                ప్రేమార్థినై వెడలినానూ
                               శిల్ప
                కామార్థినై కదలినానూ !

కన్ను విప్పితి లేస్తి
కౌగిలిని ఒదిగిస్తి

        నా లోన చైతన్య
        నా శశికళ! అనన్య !

                ప్రేమార్థినై వెడలినానూ
                               శిల్ప
                కామార్థినై కదలినానూ !