పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము


భీమ:--అట్లున్న పాపము పుణ్యము అని ప్రపంచములో ఉన్నవా లేవా?

విద్యా:--ఉన్నవండీ! ఉన్నవి. అయితే శాస్త్రరహస్యము తెలిసిన మాబోటి అచార్యులవారికిగాదది ఆభేదము శాస్త్రాధికారము లేనివారికి, మాబోటివారికి, జ్నానులకును ఈభాగములు కేవలము చిత్తవృత్తులు, దూరమునుండియే వారి యాటలు చూచుచుందుము. మరల వినండి గీతావాక్యము.


"ప్రకృతే:క్రియమాణానిగుణైకర్మాణిసర్వశ:,
      అహంకారారవిమూఢాత్మాకర్తాహమితిమన్యతే."

</poem> మంచిదికాని, చెడ్డదికాని, పాపముకాని, పుణ్యముకాని, 'నేను చేస్తాను ' అనుకొనుట మాత్రము తప్పు ఇది వట్టియహంకారము.

భీమ:--లొకులు ఎమునుకొందురో, ఆచార్యుయులవారూ! అదేమియు8 విచారింపవలదా?

విద్యా:--లోకులు? ఎవరికర్మ వారు అనుభవించుదురు. అయితే ఒక్కటియే ముఖ్యాంశము లొకులనొట పడకుండ కొంచెము సంప్రదాయము ననుసరించి ఆచరించునది. మీకేమి కొఱత? ప్రాత:కాలమునకే లేచెదరు. స్నాన సంధ్యావందనాద్యనుష్ఠానములు జరుపుచున్నారు. గోపీచందన ద్వాదశోర్ద్వపుండ్రములు ధరించుచున్నారు. సదక్షిణ బ్రాహ్మణపూజ చేయుచున్నారు. దేవాలయముయ్లు కట్టింఛడమునకై చందాలు వసూలుచేయుచున్నారు. ఇప్పటి ఈనవీన పద్దతులు జాతి మతభేదములు లేవనియు, మాల మాదిగలు మనకు సమమనియు ఇట్టి వక్రమార్గములలో ఒక్కటియైననులేవు. పైగా అన్నిటికంటె ముక్యముగా లొకులకు తెలియునట్లు, ఏకాదశీ వ్రతము నాచరించు చుయున్నారు. చాతుర్మాస్యము పట్టుకున్నారు. కేసులకుగాను చెన్నపట్నానికి పోయినప్పుడంతయును తిరుపతికి పోయివస్తారు. ఇంకేమి గావలయును? లోగుట్టు పెరుమాళ్ళకెఱుక, చూచితిరా! ఏను