పుట:Sarada Lekhalu Vol 1.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీరస్తు

శ్లో॥ వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే।
జగతః పితరౌవన్దే పార్వతీ పరమేశ్వరౌ॥

ఒక చిన్న మనవి

దేశాభ్యుదయావాప్తికి స్త్రీజనాభ్యూదయసాధనము, ప్రధమకర్తవ్యమను పూర్ణవిశ్వాసముతో శ్రీయుత డా॥ కే. యౝ. కేసరిగారు, సం 1928 రపు మార్చిమాసము నుండియు, నాంధ్రభాషలో "గృహలక్ష్మి" యను సచిత్ర మాసపత్రిక నొకదానినిఁ బ్రచురించుచుండుట, లోకవిదితము, కదా! ప్రతిఫలాపేక్షా రహితమగు వీరి పరిశ్రమవలన నాంధ్రదేశమున యువతీజనసమాజములయం దపూర్వమైన యుత్సాహము కలుగఁజొచ్చినది. పెక్కండ్రు, స్వయముగ వ్యాసరచయితలు, ఈ సంచిక తమకొరకే యుద్దేశింపఁబడియుండుట కెంతయు సంతోషపడి, దీనినిఁ బ్రాణపదిలముగాఁ గాపాడుకొనఁ జొచ్చిరి. ఇట్టి సోదరీలోకమున సగ్రగణ్యయనఁబడఁ దగిన వ్యక్తియే యీ,