శారదలేఖలు
165
లగుటయో ఇవియే వారిని పరిత్యజించుటకు కారణములు. ఇందు వారు గావించిన నేరమేమియులేదు. అయినను వారు నిర్దాక్షిణ్యముగా భర్తలచే విడనాడబడి జీవచ్ఛవములవలె పుట్టినింట బడియున్నారు. నిజముగా నిట్టి క్రూరకర్మము తలంచినప్పుడు డైవోర్సుచట్టము నిప్పటి కిప్పుడు పుట్టిన బాగుండుననినంత మనస్సు భగ్గురుమనును. కాని మన ఆర్యసాంప్రదాయ ధర్మమునుబట్టియు, కుటుంబజీవితముయొక్క శాంతి నాశించియు, సంతానమునకు కలుగబోయెడి యుపద్రవము నాలోచించియు నించుక వెనుక ముందులరయుట యవసరమగుచున్నది. కాన ప్రత్యేక పరిస్థితులలో అనగా బాలిక గర్భాదానము కానట్టిదియు లేదా సంతానము లేనట్టిదియునై యుండి భర్త షండుడు, పిచ్చివాడు, కుష్ఠురోగి, దేశాంతరగతుడు నైనచో నట్టి బాలికకు పునర్వివాహ మొనర్పనగును. ఇదియే యాజ్ఞవల్క్యస్మృతియం దుదాహృతమైన ధర్మసూత్రము. ఇట్టి స్థితియందే స్త్రీకి పునర్వివాహార్హత నొసంగనగునని నాయభిప్రాయము. దీని కొప్పదేని జీవత్కళత్రునకు వివాహాధికారము శాసనరీత్యా నిషేధింపబడవలెను; కాని యెట్టి మినహాయింపులులేక విడాకులచట్టము నామోదించుట మాత్రము ఉచితమార్గము కాదు. నేనిట్లు వ్రాయుటచే విడాకులచట్టము వచ్చినంతమాత్రముననే దంపతులెల్లరు కుప్పలుతిప్పలుగా త్రెంపి ముడులు పెట్టుకొందురా, ఏమి నీ పిచ్చి యూహయని నీవు నవ్వెదవేమో: కాదు. కాదు! ಅಟ್ಟೆ విషమస్థితి భారతదేశమున కింతలోరాదు. కాని త్రికరణములయందు