పుట:Saptamaidvardu-Charitramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

91


గట్టిన తూములను దెఱచెను. అతఁడు ఆతూములను దెఱచుటచేమధ్యధరా సముద్రమందలి నీరు సూయజు కాలువలోనికి రాసాగెను. కానీ, కాలువ పని పూరి కానందున ఆతూములు మరల మూసికొనెను. . ఎడ్వర్డు ప్రభృతులు పోర్టు సెయిడ్డు రేపు పట్టణముఁ జేరి, కాన్ స్టాంటినోపిలు పట్టణమునకుఁ బోవ నోడ నెక్కి, అలెగ్జాండ్రాపురికి నచ్చి అందలి పాంపె జయ స్తంభమును జూచి, కాన్ స్టాంటినోపిలునకు నేఁగ నోడ నెక్కి... పయనము బాగుగ నడిచెను. కాన్ స్టాంటినోపిలు పురికి మూడుమైళ్ల దూరమున నే వ చ్చిన టర్కీ సుల్తానుని పడవలోనికి నారాజదంపతులు దిగి, తుర క రేనివీటఁ బ్రవేశించిరి

ఆశీయాలోనుండు, టర్కీ కిని, అయిరోపొలోనుండు టర్కీ-కిని, ప్రభు వొకఁ డేను. అతనికి కాన్ స్టాంటినోపిలు రాజధాని, అతను నిరంకుశాధికారమును చెల్లించు చుండువాడు. అతని మాటకు నెట్టి ప్రజ్ఞావంతుఁడును, ఎదు రాడ భీతిల్లు చుండును.అతని యంతఃపుర స్త్రీలు తమ నాథునితప్ప అన్యపురుషుల మోముల నెన్నడును జూచి యెఱుగరు. అట్టిచోట ఎడ్వర్డలెగ్జాం డ్రులు కొన్ని నాళ్లుండిరి. సుల్తాను ఆంగ్లేయుల యాచార వ్యవహారుబులు నెరింగిన వాడు. అతడు రాజదంపతులతో నధికమైత్రిని బ్రవ ర్తించి, వారికి సకల సౌఖ్యంబులు కలుగఁ జేయు చుండెను.