Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆస్ట్రియా - (హంగేరి)

సంగ్రహ ఆంధ్ర


చార్లి మేను కాలమున ఈ పేరు వాడుకలోనికి వచ్చినది. ఐరోపాలో డాన్యూబునది కిరువైపుల యుగోస్లేవియా, స్విట్జర్లాండు, ఇటలీ జర్మనీల మధ్య 32,375 చ. మై. విస్తీర్ణము, సుమారు 68,18,593 జనాభా గల చిన్న రాజ్యమే ఆస్ట్రియా, వియన్నా ఈ ఆస్ట్రియాకు ముఖ్య పట్టణము.

ప్రాచీన చరిత్ర  : ఐరోపాలో అనేక జాతులకును, నాగరకతలకును కూడలియై చరిత్రలో ఆస్ట్రియా పెక్కు రాజకీయ పరిణామములను గాంచినది. ఈ ప్రాంతమును క్రీ. పూ. 15 సం. న రోమనులు కెల్టులను జయించి, ఆక్రమించి క్రైస్తవమతమును ప్రవేశ పెట్టిరి. రోమనుల పాలనములో విండోబోనా (వియన్నా) నగర మభివృద్ధి చెందేను. క్రీ. శ. 5 వ. శతాబ్దమున హూణులు, లొంబార్డులు, శ్లావులు, ఆవారులు దండెత్తి రోమను పరిపాలనము నంతమొందించిరి.

ఆస్ట్రియా నిర్మాణము  : క్రీ. శ. 805 లో ఫ్రాంకుల చక్రవర్తియగు చార్లె మేన్ ఆస్ట్రియాను జయించేను. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీలను కలిపి పవిత్ర రోమక సామ్రాజ్యమును స్థాపించినది ఇతడే (క్రీ. శ. 800). ఇతడు తన సామ్రాజ్య ప్రాగ్భాగరక్షణార్థము ఆస్ట్రియా యను రాష్ట్రము నేర్పరచి అందు పటిష్ఠమగు ప్రభుత్వము నేర్పరచెను. నాటినుండి చరిత్రలో ఆస్ట్రియా పేరు వెలసినది.

బాబెన్ బర్గులు  : 10వ శతాబ్దారంభమున మొరేవియన్లు హంగేరియనులు ( మాగియారులు) అను తెగలవారు ఆస్ట్రియా నాక్రమించిరి. వీరినుండి జర్మను చక్రవర్తియగు ఆటో, ఆస్ట్రియాను జయించి 976 లో బాబెన్ బర్గు వంశీయుడగు లియో పాల్గున కొసగెను. ఆస్ట్రియా చరిత్రలో ఇది ప్రసిద్ధమగు సంఘటన, బాజెన్ బర్గుల పాలనములో ఆస్ట్రియా దినదినాభివృద్ధి చెందినది. స్టిలియా, (1192) కరోలినా (1229) ప్రాంతములు ఆస్ట్రియాలో చేరినవి, పవిత్ర రోమక సామ్రాజ్యమున ఆస్ట్రియా ప్రధాన రాష్ట్రములలో డచి (Duchy) ఒకటి అయ్యెను. వియన్నా ఆస్ట్రియాకు ముఖ్య పట్టణమై మత, భాషా, సాంస్కృతిక కేంద్రమయ్యెను.

హాప్సు బర్గులు : 1246 లో బాబెన్ బర్గు రాజవంశ మంతరించుటచే ఆస్ట్రియనులు ట్రూజెన్సీకడ సమావేశమై బొహిమియా రాజగు ఆటో కారును రాజుగా నెన్నుకొనిరి (1251). ఆస్ట్రియాతోబాటు హంగేరిని గూడ నాక్రమించి (1261) ఆటో కారు జర్శను సార్వభౌమత్వమునకు అఱ్ఱులు జాచసాగెను. జర్మనీలోని భూస్వాములు ఆటోకారు చక్రవర్తి యైనచో తమ ఆటలు సాగవని గ్రహించి నాటికి అనామకుడై యుండిన పోప్సు బగ్గు వంశీయుడగు రుడోల్ఫును చక్రవర్తిగా నెన్నుకొనిరి. చక్రవర్తియైన తరువాత రుడోల్ఫు ఆటో కారును జయించి, ఆస్ట్రియా నాక్రమించెను. ఈ సంఘటనములతో ఆస్ట్రియాతో బాటు హావ్సుబర్గులు బలపడి ఐరోపా రాజకీయ రంగమున స్థిరపడిరి.

చక్రవర్తి పదవియందున్న హాప్సుబర్గులు ప్రత్యేకాభిమానముతో తమ మాతృభూమి యగు ఆస్ట్రియా అభివృద్ధికి పాటుపడిరి. రాజకుమారులు ఆస్ట్రియాపాలకులుగా నియమింపబడుచుండిరి. వీరి పాలనములో ఆస్ట్రియా సర్వతోముఖాభివృద్ధి నందెను, 4 వ రుడోల్పు 1356 లో వియన్నా విశ్వ విద్యాలయమును స్థాపించెను. అతని తమ్ముని పౌత్రుడగు 5 వ ఆల్బర్టు హంగేరీరా జైన సిగి