విజ్ఞానకోశము - ౨ 8. కాంతి ప్రసరణము స్నిగ్ధములైన ఉపరితలముల (Polished surfaces) నుండి ప్రతిఫలించును; కాంతి పరావర్తన సూత్రముల (Laws of reflection of light) కు అది లోబడియుండును. 4. రెండు కిరణ భేద్యయానక ములు (Transparent media) కలియు సరిహద్దువద్ద ప్రసరణము వక్రీభవనము (refraction) ను చెందును; కాంతి యొక్క వక్రీభవన సూత్రములనే ఇది అనుసరించును. 5. దృశ్యప్రసరణమువలె, ఇది జోక్యము (Inter- ference), నమనము (diffraction), ధ్రువీకరణము (polarization) అను గుణములను ప్రదర్శించును. 6. అది, కల్పించును. ప్రసరించు ఉపరితలములపై ఒత్తిడి కిర్చాఫ్ సూత్రము : ఇదివరలో పేర్కొని నట్లు ఒక పదార్థమునుండి ఉత్పన్నమగు ఉష్ణధారణ కిరణ ప్రసర ణము యొక్క తీవ్రత దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి యుండును. ఇంతేకాదు. ఒకే ప్రమాణముగల ఉష్ణోగ్రత గలిగియు, నల్లనైన, తెల్లనైన, స్నిగ్ధ (polished) మైన, అస్నిగ్ద (dull) మైన ఇట్టి భిన్నములైన ఉపరి తలములుగల పదార్థములనుండి, వేర్వేరు ప్రమాణము లలో ఉష్ణధారణ కిరణ ప్రసరణము బయల్పడును. నల్లనై నట్టియు, ప్రకాశరహితమైనట్టియు ఉపరితలములు, కెల్ల నైనట్టియు, స్నిగ్ధమైనట్టియు ఉపరితలములకంటె అధిక తరమైన ఉష్ణధారణ కిరణ ప్రసరణము కావించును. బాహ్యస్థానమునుండి అట్టి ఉపరితలముల మీద కాంతి ప్రసరణము జరిగినపుడు, తెల్లనై, స్నిగ్ధమైన ఉపరి తల ములకంటె, నల్లనై, శాంతి రహితములైన ఉపరితలములే (black and dull surfaces) కాంతి ప్రసరణమును ఎక్కువగా శోషణము చేసికొనునని గమనింపబడినది. ఉద్గారము (emission) నందును, శోషణమునందును నల్లని ఉపరితలములే మిగులు సమర్థముగ కనిపించును. తళతళలాడెడి ఒక లోహపు పళ్ళెరము తీసికొని దాని పైన నల్లగా ప్లాటినము అను పదార్థముచే పూత పూసి నచో దానిపై నల్లని మచ్చ ఏర్పడును. ఆవళ్ళెరము తెల్లనగువరకు కొలిమిలో కాచి ఉష్ణోగ్రతను కల్గించినచో దానియందలి తక్కిన భాగముకంటే, పై చెప్పబడ్డ నల్లని 92 729 కిరణ ప్రసరణము మచ్చ ఎక్కువ ప్రకాశవంతముగ మెరయును. దీనినిబట్టి కిర్ చాక్ అను శాస్త్రవేత్త విఖ్యాతమగు తన సిద్ధాంత ములో ఉష్ణధారణ కిరణ ప్రసరణము ఉపరితలముల యొక్క స్వభావముపై ఆధారపడు విధానమును బహు చక్కగ సంగ్రహించెనని వ్రాయుచున్నాడు. దీనికై అతడు పూర్తిగా నలుపైన పదార్థ భావన (concep- tion) ను ఉపయోగింపవలసి వచ్చెను. సూటికి నూరు వంతుల సామర్థ్యముతో, తనపై బడిన ప్రసరణమును శోషణము చేసికొనునదియే పూర్తిగా నల్లని పదార్థ మగును. దీపపు మసిని (lamp black) ఇట్టి ఆదర్శ మైన నల్లని పదార్థములకు అత్యంత సన్నిహితమైన దానినిగా పరిగణింపవచ్చును. నిర్ణీతమయిన ఒక ఉష్ణో గ్రతా పరిమాణ దశయందు, ఉద్గార శోషణ శక్తుల మధ్యగల నిష్పత్తి అన్ని పదార్థములందును సమానమగు ననియు, పూర్తిగా నల్లనైన పదార్థముల యొక్క ఉద్గార శక్తితో తులతూగుననియు కిర్ చాఫ్ సిద్దాంతము వలన సులభముగ తెలియుచున్నది. 'ఉద్గారశ క్తి', 'శోషణశక్తి' (emission power & absorption power) అను పదములు ఈ దిగువ నిర్వ చింప బడినవి. నిర్ణీతమయిన ఒక పదార్థపు ఉపరితలము యొక్క ప్రమాపకాంశ విస్తీర్ణము (unit area) నుండి ఒక ప్రమావశాంశ కాలములో (unit time) ప్రసరించు శక్తియొక్క మొత్తము 'ఉద్గారశక్తి' అనబడును. ఒక పదార్థముచే శోషణము చేసికొనబడిన కిరణ ప్రసరణశ క్తి లోని ఒక భాగమే 'శోషణళ క్తి' అనబడును. పెక్కు భౌతిక (physical), ఖగోళ భౌతిక (astro physical) నిరీతణముల (observations) ను వివరించుటయందు ఈ సూత్రము (Law) అత్యంత ప్రాముఖ్యము వహించి యున్నది. పై వివరించబడిన సూత్రము, అన్ని వర్ణముల (colours) యొక్కయు లేక అన్ని తరంగ దైర్ఘ్యముల యొక్కయు పూర్ణప్రసరణమునకు అన్వయించును. ఇంతే కాక వ్యక్తి గతమైన తరంగదైర్ఘ్య విషయములయందును ఈ సూత్రము అన్వర్థమైనది. ప్రేషణమొందు (Trans- mitted) తెల్లని శాంతిలో, గాజు ముక్క ఆకుపచ్చగా అగపడును. అందుకు కారణము, ఆ గాజుముక్క ఎఱ్ఱని రంగును తనలోనికి పీల్చుకొనుటయే. ఆ గాజుముక్కను L
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/782
Appearance