విజ్ఞానకోశము - (1-6, 10, 49, 58)కన్పించుటచే కాళిదాసు అగ్నిమిత్రుని కాలమువాడని ఏల ఎంచరాదు ? మిగిలిన నాటకములలోవలెగాక, మాలవి కాగ్ని మిత్ర మందలి భరతవాక్యమున పూర్వార్ధము కథావస్తువులోనీ భాగము. ధారణితో అగ్నిమిత్రుడనిన మాటలివి: మామూ లుగా ప్రజాశ్రేయమును ఆశీర్వదించుట ఇచట లేదు. సంప్రదాయముగా వచ్చు ఆచారమును ఉల్లంఘించుటకు కారణము ఉత్తరార్ధమున కలదు. అగ్నిమిత్రుడు రాజగు టచే, విశేషించి కోరదగినదేమియు లేదని ఉత్తరార్ధమున భావము, ఈ నాటకమున నాయకుడు, విదూషకుడు ఇతర నాటకములలోని పాత్రలవలె లేరు. ఇచట చాల వరకు సమకాలిక వాతావరణమునే కవి చిత్రించినాడు. మేఘదూతలో ప్రస్తుతింపబడిన "ప్రథిత విదిశాలకణాం రాజధానీం" అను మాటలలో అగ్నిమిత్రుని ముఖ్యపట్టణ మైన విదిశానగరము పేర్కొనబడినది. శుంగ వంశీయుల కాలమునకు చెందిన ఒక ఫలకముపై శాకుంతలములోని ప్రథమాంక సన్ని వేశము చిత్రింపబడినదికూడ. కావున కాళిదాస మహాకవి అగ్నిమిత్రకుంగుని కాలమునకు చెందినవాడు కాళిదాసమహాకవి అనవచ్చును. రఘువు యొక్క దిగ్విజయమునకు సముద్రగుప్తాదుల దిగ్విజయమునకు సామ్యము ఈషన్మాత్రమే. రఘువు పారశీకులను జయించి (4-60) హూణులు నివసించు వంతు నదీతీరముల కేగినాడు (4-66-68). క్రీ.శ. మూడు నాలుగు శతాబ్దములకు హూణులు వంకున దీ తీరమునుండి సింధునది వరకు వ్యాపించిరి. ఈ కారణములనుబట్టి కాళిదాస మహా కవి క్రీ. పూ. మొదటిశ తాబ్దమువా డని చెప్ప వీలున్నది. గ్రంథములు : కాళిదాస కృతములని చెప్పబడు వాటిలో ఋతుసంహారము, మేఘదూతము, కుమారసంభవము, రఘువంశము, మాలవికాగ్ని మిత్రము, విక్రమోర్వ శీయము, అభిజ్ఞాన శాకుంతలము, శ్రుతబోధ, శృంగార తిలకము, పుష్పబాణ విలాసము, శృంగార రసాష్టకము, సేతుకావ్యము, కర్పూరమంజరి, శ్యామలాదండకము, ప్రశ్నో త్తరమాల, జ్యోతిర్విదాభరణము కన్పించుచున్నవి. వీటిలో మొదటి ఏడు గ్రంథములు ఒకేఒక వ్యక్తి చే రచింప బడినవనియు, అతడే సుప్రసిద్ధుడైన కాళిదాస మహాకవి యనియు చెప్పగలము. కాళిదాసు అను ఒక సుహాకవి 91 721 కాళిదాసమహాకవి కవిలోకమున ప్రఖ్యాతి వహించిన పిమ్మట, అదేనామమును పలువురు ధరించుట సహజము, భోజ ప్రబంధామలలో కన్పించు కాళిదాసు మిగిలినవాటిలో కొన్నిటిని రచించి యుండవచ్చును. ఇట్లే ఉత్తర కాలామృతకర్త వేరొక రఘువంశ, కుమారసంభవ, మేఘదూతములలోను, శాకుంతలాది మూడు నాటకములలోను కన్పించు సన్ని వేశములు, పాత్రపోషణ, శైలి మొదలగునవి సన్నిహిత మైన పోలికలు కలిగియుండుటచే ఇవి యొకని కావ్యము లని వ్యవహరించ వీలున్నది. వీటిని రచించుటకు పూర్వము చెప్పినది ఋతుసంహారముగా కన్పట్టును. ఋతుసంహారము : ఋతుసంహారము ఖండకావ్యము. ఆరు ఋతువులను చిత్రించు లఘుకావ్యమిది. ప్రకృతిలో భావనాదృష్టికి గోచరించు సౌందర్యము ఈ ఋతు సంహా రమున ప్రతిఫలించుచున్నది. మానవునకును ప్రకృతికిని అవినాభావ సంబంధమున్నదని, ప్రకృతిలో ఆధ్యాత్మిక తత్త్వము కలదని చెప్పు ఈ కావ్యమున భావనాపటిమ, లాలిత్యము, ప్రసాదగుణము కలవు. కాళిదాసుని తర్వాతి కావ్యనాటకములకు ఈ ఖండకావ్యమొక నాందివంటిది. కాంచును. మేఘదూతము సందేశ కావ్యములకు ఆదర్శము, ప్రియావియోగజనితమగు ఆక్రాంతముతో సహృదయ హృదయాను ప్రవేశము గలదియగు మేఘదూత మహో న్నత మగు కావ్యము. కుబేరశాపము వలన ఒక ఏడాది భార్యనుండి ఎడబాటు ననుభవించుచున్న యకుడు రామగిరి యందు ఆషాఢ మేఘమును కానూర్తుడై చేతనాచేతన వివేకమును కోల్పోయి, తన భార్య కొక సందేశమును తీసికొనిపొమ్మని మేఘుని యాచించును. పూర్వమేఘమున అలకాపురికి గల మార్గ వర్ణన, ఉత్తరమేఘమున సందేశమును కలవు. హృదయ మున రగుల్కొనిన వియోగాగ్ని మందమందముగా యతుని జీర్ణింపజేయుటచే, మందాక్రాంతమున రెండు భాగములను మహాకవి వడిపినాడు. భావమును, భావనను సమన్వయింపజాలిన వృత్తముతో మేఘదూతము సుందర కావ్యముగా, లలితముగా పరిణమించినది. మేఘముతోబాటు గిరి, నదీ, కానవ, నగరాదులు ఇట చేతనములైనవి. విప్రలంభమున తగుల్కొనిన నాయకుని
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/774
Appearance