Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆసనములు 3. పద్మాసనము ఎడమతొడ మూలమునందు కుడిమడమ నుంచవలయును. కుడితొడ కాలము నందు ఎడమమడమ నుంచవలెను. హ స్తద్వయ ముసు మోకాళ్ళపైన జ్ఞానముద్రణో నుంచి వెన్నె ముక నిటారుగా నుండగా దృష్టిని నాసికాగ్ర మున నిలుపవలయును. దీనిచే కర్మేంద్రియములు స్వాధీనములోనుండి మనస్సు ఏకాగ్రతను చెందును. 4. శుష్కా సనము : ఎడను తొడ మూలము మనం కుడిమనునుంచి కుడి తొడ మూలమునందు ఎడమ మడమనుంచి, ఊపిరితిత్తులలో శ్వాసలేకుండ చేసి అభ్యాసకుడు తన నొసటిచే భూమిని తాక వలయును. రెండుచేతులు మెలికతో నడుము పై నుంచవలయును. అప్పుడు రెండు మడమలును పెద్ద పేగు యొక్క రెండు మెలికెలను ఒత్తిడిచేసి దుర్వాయువులను పారదోలును, ఈ ఆసనము వెన్నెముకను స్నిగ్ధముచేసి మంఛిస్థితిలో నుంచును. మణిపూర చక్రము పై ప్రభావము పడును. దీని 5. పశ్చిమోత్తానాసనము : రెండు కాళ్ళను నిటారుగా జాపి రెండు చేతులచే కాళ్ళ బొటనవేళ్ళను పట్టుకొని గాలిని వదలి నొసలు మోకాళ్ళపై నుంచవలెను. కరచరణ ములకు వ్యాయామము కల్గును. ఈ ఆసనముచే వెన్ను పూస దృఢపడును. విశుద్ధ, మణిపూరక చక్రములపై ఈ అసనప్రభావము ప్రసరించును. జీర్ణశక్తి వృద్ధిపొందును, 6. సర్వాంగాసనము : సమమయిన నేలపై చాప వేసికొని వెలికిల పరుండి, రెండు మోచేతులను భూమిపై నుంచి హస్తములు శరీరమున కండగా నుంచి కాళ్ళు నిటారుగా నెత్తవలయును. గడ్డము వడమునకు అని యుండవలెను. దీనిచే వెన్నెముక బలిష్ఠమగును. జఠరాగ్ని ప్రజ్వరిల్లును, విశుద్ధ, అనా హత చక్రములపై ప్రభావము ప్రసరించును. 7. హలాపనము: సమమైన భూమిపై వెలికిల సరుండి అరచేతులు భూమిని ఆనియుండగా మోకాళ్ళవద్ద కాళ్ళువంచకుండ నడుమును వంచుచు, పొదద్వయపు బొటన వ్రేళ్ళు శిరస్సునకు 12 అం. ల దూరములో భూమిని తాకవలెను. దీనిచే జఠరాగ్ని ప్రకోపించును. పేగులలో దాగియుండు దుర్వా హలాపనము సంగ్రహ ఆంధ్ర యువులు బహిర్గతము లగును. వెన్నెముక దృఢపడును. విశుద్ధ, అనాహత, మణిపూర చక్రములపై ప్రభావము కలుగును. 8. మయూరాసనము: రెండుచేతులు భూమి వానియుండ రెండు మోచేతులు నాభికి అండగా నుండ, రెండుకాళ్ళను వెనుకకు నిటారుగా తీసికొని వెళ్ళుచు శరీరపు బరువును మోచేతులపై మోపవలయును. తల ఎత్తియుంచవల యును. దీనిచే ఉదరములో జనించు అన్ని విధముల వార ములు హరించిపోవును. జీర్ణశక్తి పెంపొందును. జఠరాగ్ని ప్రజ్వరిల్లును. మణిపూర చక్రముపై ప్రభావము పడును. లి. ధనురాసనము : సమమైన భూమిపై బోర్లగా పరుండి రెండు చేతులచే రెండు చీలమండలను పట్టుకొని ఢమరాసనము 22