Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము ఆర్ష వాస్తుశాస్త్రము : గృహగ్రామనగరాదుల నిర్మాణమునకు సంబంధించిన శాస్త్రమునకు వాస్తువని పేరు. ఋషి విరచితములైన ఈ క్రింది గ్రంథములు ఈ శాస్త్రమునకు ప్రమాణములు : (1) వసిష్ఠ సంహిత (ఇందు వాస్తువు ఒక అధ్యాయముగా నున్నది) (2) మయమతము (3) శిల్పరత్నాకరము (4) అగ్ని పురాణము (5) బృహన్నారదీయపురాణము. (ఇందు జ్యౌతిషాయ మను పేరుతో త్రయోదశాధ్యాయ మున్నది) (6) నారద సంహిత (7) మత్స్య పురాణములో 252 వ అధ్యాయము (8) భృగు సంహిత (9) కామికా గమము (10) విశ్వకర్మ ప్రకాశిక మున్నగునవి. మొ త్తము పదు నెనమండుగురు ఋషులు వాస్తుశాస్త్రోపదేశకులుగా మత్స్య పురాణములో చెప్పబడి యున్నారు. ఈ ఆర్ష గ్రంథముల ఆధారముచే రచింపబడిన గ్రంథములలో భోజకృతమైన సమరాంగణము, శిల్ప రత్నము, మాధవ విద్యారణ్యకృతమైన విద్యా మాధవీయము మున్నగునవి ముఖ్యములై నవి. మత్స్య పురాణములో వాస్తు పురుషోత్పత్తిని గురించి ఈ రీతిగా చెప్పబడినది; త్రేతాయుగములో బ్రహ్మ యొక భీకర భూతమును సృజించెను. ఆ భూతము లోకములను బాధింపజొచ్చెను. దేవతలు బ్రహ్మవద్ద మొర పెట్టుకొనగా బ్రహ్మ ఆ భూతమును నేలమీద పడవైచెను. ఆ భూతము అధోముఖముగాను, ఈశాన్యమునందు శిరస్సుతోను, నైరృతియందు పాదములతోను నేలపై బడెను. అ బ్రహ్మ ఆ భూతమున కిట్లు వరమిచ్చెను: “గ్రామ, నగర, వాపీ, దుర్గ, పత్తన, ప్రాసాద, ప్రపా, జల, ఉద్యాన నిర్మాణ సమయములందు ప్రజలు నిన్ను పూజింపవలయును. అట్లు పూజింపని వారికి తరచుగా విఘ్నములు కల్గును, ఐశ్వర్యము తొలగును, మృత్యువు ప్రాప్తమగును." వాస్తు శాస్త్రములో ఈ రీతిగా వాస్తు పురుషపూజ ముఖ్యాంగ ముగా ఏర్పడినది. వాస్తు శాస్త్రములో భూపరీక్ష మరొక ముఖ్యాంగము. గృహమును నిర్మింపదలచిన స్థలమును ఈ క్రింది విధముగా పరీక్షింపవలయును. ఆస్థలములో ఒక గోతిని త్రవ్వి ఆ వచ్చిన మన్నును తిరిగి ఆ గోతిలో పోయవలయును. ఆగోయి పూడగా కొంతమన్ను మిగులుచో అది తేమకర మైన స్థలమని అర్థము ; సరిగా సరిపోవుచో సామాన్యస్థల మనియు, ఆమన్నుచే గోయి పూడనిచో అది అధమస్థల మనియు తెలిసికొనవలయును. స్థలపరీక్షకు మరియొక పద్ధతియు ఆర్షగ్రంథములలో చెప్పబడినది. గోతిలో రాత్రి నీరు పోయవలయును. తెల్ల వారునప్పటికి అందు నీరున్న చో అది అభివృద్ధికరమైన స్థలమనియు, బురదయున్నచో మధ్యమ స్థలమనియు, పొడిమన్ను మాత్రమే యున్నచో, హానికరమైన స్థలమనియు ఎరుగవలయును. ఈ పరీక్షకు పిమ్మట భూశోధనము గావింపవలయును. శల్యాదులతోగూడిన స్థలములో నిర్మాణము జరుగరాదు. తర్వాత ఆయసిద్ధిని సంపాదింపవలయును. నవవర్గాది గణితములచేత శుద్ధులను గావింపవలయును. ఆయము, ఆయుర్దాయము, ధనము, ఋణము, తిథి, వారము, నక్షత్రము, అంశము, దిక్పతి, అను తొమ్మిదింటికి నవ వర్గమని పేరు. ఇందు ఆయములో బేసి మంచిది. ఆయు ర్దాయము 60 సంవత్సరములకు తగ్గరాదు; 120 సంవత్సర