Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/850

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఛాయాగ్రహణ శాస్త్రము

సల్ఫేటు (హైపో)లో పొటాస్ పట్టికల (potash alum)ను కలపిన వేడి ద్రావకములో పాజిటివు (positive) లను ముంచినచో లోహరజతము రజత సల్ఫైడుగా మారి గోధుమఛాయ (Brown) వచ్చును. పొటాసియం ఫెర్రి సయనైడు, పొటాసియం బ్రొయనైడుగా మారును. దీనిని సోడియం సల్ఫయిడు ద్రావకములో గాని, ఇతర అకర్బన (inorganic) రసాయనికములలో గాని ముంచిన, నీలముగాగాని, ఎర్రసుద్ద (Red chalk) గా గాని మార్చ వచ్చును.

వర్ణ ఛాయాచిత్రము (Colour Photography) : ప్రకృతిలో కనిపించు రంగు లన్నియు ఎరుపు, ఆకుపచ్చ, నీలము (Blue) రంగుల కలగలుపులే. ఏదైన వస్తువు నుండి వచ్చు కాంతి విడిగా యీ మూడు రంగుల కలర్‌ ఫిల్టరుల (Colour Filters) గుండా పోనిచ్చి వికాసము చేసినచో వర్ణచిత్రములు వచ్చును. ఈ క్రియ రెండు విధములు.

వర్ణ మిశ్రమ అనుసంధాన విధానము (Additive colour synthesis) : దీనిలో ఫలకముపై కాంతిప్రేరిత ఎమల్షనుమీద సూక్ష్మమైన రంగు ఫిల్టరులు సమముగా పరచబడి యుండును. కెమేరాముందు వరుసగా విడి విడిగా ఎరుపు, ఆకుపచ్చ, నీలపు ఫిల్టరులు ఉంచి కాంతిని పోనిచ్చి వికాసములో నుంచవలెను. ఎరుపు ఫిల్టరునుఉంచి కాంతిని పోనిచ్చినప్పుడు, ఎర్రని కిరణములక్రింద గల ఎమల్షనుకు మాత్రమే కాంతి తగులును. ఈ విధముగా వస్తువు నుండివచ్చు రంగునుబట్టి ఈ కణములక్రింది ప్రేరితముమీద కాంతి పడును. పిదప తెల్లనికాంతికి ఎదురుపరచి నెగటివును తిరిగి వికాసకములో నుంచి స్థిరీకరింపవలెను. అప్పుడు పారదర్శక మగు ఈ ఫలకముగుండా చూచినచో సరళ మగు వర్ణచిత్ర మగపడును. డూఫే (Dufay) వర్ణ పద్ధతిలో రంగులు కల పీఠము మీదను, ఆగ్ ఫా (Agfa) పద్ధతిలో రంగుల రెజిన్ కణములు అతికించుట వలనను ఈ వర్ణచిత్రము లేర్పడును.

రంగుల పాజిటివులు : రంగుల పాజిటివులలోని ఎమల్షనులో తక్కువ ద్రవీభవనాంశము గల (low melting point) జెలటిను, రజత హేలైడు ఉండును. ఎమల్షనునకు కాంతి ప్రసరింపజేసి, వికాస మొనర్చి, స్థిరీకరింపజేసి వేడినీటిలో కడిగినచో అందు కాంతి తగిలిన చోట్ల జెలటిన్ మిగిలి, ఇతర ప్రదేశములలో అది కరగిపోవును. తరువాత కావలసిన రంగులో ముంచినచో కాంతి తగిలిన ప్రదేశములలో గల జెలటినులో ఆ రంగు ప్రవేశించును. పైన చెప్పిన మూడు రంగులలో అట్లే రంగుల ఎమల్షనులను తయారుచేసి, వాని నొకదానిపై నొకటి పేర్చి అంటించినచో ఒక సంపూర్ణ వర్ణచిత్ర మేర్పడును. దీనిని డై ట్రాన్సుఫరు (Dye tranfser) అని కాని, టెక్ని కలర్ (Techni Colour process) అనిగాని అందురు.

చిత్రము - 226

పటము - 2


ట్రైపాక్ విధానము (Tripack Method) : దీనిలో ఒకే పీఠముపై వరుసగా ఎరుపు, ఆకుపచ్చ, నీలము అను రంగులచే ప్రేరితములగు ఎమల్షను లుండును. కోడా క్రోము పద్ధతిలో 'వర్ణబంధములు' (Colour couplers) అను రసాయనము వలన కాంతి ప్రసరించిన ప్రదేశములలో రజత హేలైడ్ యొక్క ఆమ్లీ కరణము మూలముగా కరుగని రంగు పదార్థ మేర్పడును. కాని కోడా కలరు (Koda colour, Anscoclor, Agfa colour) పద్దతులలో వికాసములో నుంచిన పిదప ఈ వర్ణ బంధముల నుపయోగింతురు. దీనివలన వర్ణ సంకరము కొంత తగ్గును.

ఉపయోగములు : ఉత్సాహవంతులగు ఛాయా చిత్రకారులు ఈ విశ్వమందలి ప్రతి వస్తువును, తచ్చర్యలను, ఛాయా చిత్రములుగా తీయ ప్రయత్నించుట ప్రపంచ

783