విజ్ఞానకోశము - 3
ఛాయాగ్రహణ శాస్త్రము
వలన అవసరము లేనప్పుడు దగ్గరకు నొక్కి వేయ వచ్చును. రిఫ్లెక్స్ కెమేరాలలో 45° కాంతి అక్షమునకు అద్ద ముండుట వలన బింబమెట్లుండునో చూడవచ్చును. దృశ్య దర్శిని (View finder) మూలముగా బింబమెంత పడునో తెలియును. దూర మానిని (Range finder) మూలముగా వస్తువునకు కెమేరాకును గల దూరము తెలియును. కెమేరాలకు కృత్రిమ కాంతి సాధనములు, కలరు ఫిల్టరులు కూడ సహాయ కారులుగ నుండును.
చిత్రము - 225
పటము - 1
కాంతి ప్రేరిత పదార్థములు : విలోయ (Soluble) రజత లవణములలో (సాధారణముగా రజత నత్రితము) విలోయ హేలైడ్ లవణములను మిశ్రమము చేసినచో నీటిలో కరుగని మిశ్రమ మొకటి ఏర్పడును. దీనిలో జలటిన్ కలిపిన యెడల అది హేలైడ్ లవణ కణములు ఒకదాని కొకటి అతుకుకొని పోకుండ విడివిడిగా నుంచి భద్రపరచును. ఈ విక్షి ప్తలేపనము (Dispersed paint) యొక్క గుణములు దానిలో నుండు మిశ్రమముల యొక్క పరిణామములమీదను, తయారుచేయు విధము మీదను ఆధారపడి యుండును. బ్రొమైడ్, ఆ యొడయిడ్ లవణముల మిశ్రమమున్న పూత అన్నిటి కన్న ఎక్కువగా కాంతి ప్రేరితమగును. ఇంకను ఎక్కువ సూక్ష్మగ్రాహ లేపనములను తయారు చేయవలె ననినచో జెలటినును కొద్దిగా వేడి చేసిన చాలును. అది రసాయనిక మార్పులు చెంది సూక్ష్మగ్రాహ శక్తిని పొందును.
ప్రతి మిశ్రమము (Emulsion) కూడ నిర్ణీతమైన (fixed) కాంతి తరంగములకు మాత్రమే ప్రేరణ (Response) పొందును. రజత క్లోరైడ్, బ్రోమైడ్, అయొడైడ్ (హే లైడ్ల ) మిశ్రమములను పెక్కు పాళ్ళలో (Proportions) కలిపిన దృశ్య వర్ణమాల, ఎక్స్ రేలు అతినీలలోహిత (ulter violet) వర్ణములు మొదలగువానికి ప్రేరణ చెందు ప్రేరితములను తయారు చేయవచ్చును. ఇంతేకాక నీలమునుండి ఆకుపచ్చ వరకు (600 m /) పనికివచ్చు ఆర్థోక్రోమెటిక్ (orthochromatic) రకము గాని, పూర్తి వర్ణమాలను గ్రహించు పాన్క్రోమెటిక్ (panchromatic) ప్రేరితముగాని తయారు చేయవచ్చును.
కాంతిచే ప్రేరితములగు ఎమల్షన్లు గాజుపలకల పారదర్శక ప్లేస్టిక్ ఫిల్ముల మీదగాని కాగితములమీదగాని పూయబడును. ఈ ఎమల్షన్ల క్రింద అపరివేషకము (anti-halation layer) గా రంగు పూత ఉండును. దీని వలన ఎక్కువగా కాంతి ప్రసరించిన భాగములందు పరివేషములు ( halos) కలుగవు. ఫిల్ములపై జెలటిన్ పూత పూసినచో కాంతి ప్రేరిత పదార్థము ముడతలు పడదు. ఆర్థోక్రోమెటిక్ (arthochromatic) ఫిల్ములు నీలము నుండి ఆకుపచ్చ కాంతి వరకు ప్రేరితముగా నుండుటచే ఎక్కువ రసాయనికపు మార్పులు అవసరము లేకయే బింబము స్పష్టముగా నుండును. పాన్-క్రోమెటిక్ (Panchromatic) ఫిల్ము దృశ్య వర్ణమాల కంతకును ప్రేరితముగా నుండుటచే ఏక వర్ణ చిత్రములు బాగుగా వచ్చును. వీనికి సన్నని కణములు గల ఎమల్షను పూయబడి యుండును. ఎక్సురే ఫిల్ములకు సాధారణముగా పలకకు రెండు ప్రక్కల ఎమల్ష నుండును.
ఏక వర్ణమగు ఫొటోగ్రఫిక్ కాగితములు సాధారణముగా నాల్గు రకములు. పి. ఓ. పి. కు (Printing out paper) వికాసము అక్కరలేకనే బింబము వచ్చును. గాస్ లైట్ (Gas light) కాగితమునకు రజత క్లోర
781