విజ్ఞానకోశము - 3
చైనాదేశము (భూ)
“లోయస్” అందురు. ఈ లోయస్ మెత్తగా, పొడిగా నుండును. మానవులయొక్కయు, గుఱ్ఱములయొక్కయు, లొట్టియల యొక్కయు పాద ఘట్టనలచేతను, శకట చక్రముల ఒరిపిడిచేతను, మార్గములు అరిగి అరిగి, చెట్లు, కప్పు లేని ఒక సొరంగముగా నేర్పడును. ఈ సొరంగ మార్గము భూమ్యుపరితలమునకు 20 అడుగులకంటె ఎక్కువ లోతున నుండును. ఈ సొరంగ మార్గములందు ప్రయాణముచేయు పథికులకు భూమిమీది పరిసరములను చూచుట కవకాశము లేకుండనే రోజుల కొలది ప్రయాణము చేయవలసి వచ్చును. కొన్ని ప్రాంతములలో వండలిమట్టి (Loess) గుట్టలయందు తొలచబడిన గుహా మందిరములందు జనులు నివసింతురు. ఆల్మయిరాలతో, మేజాబల్లలతో, అరుగులు ఉండుటకు వీలుగా, విశాలముగా ఈ గుహ మందిరము లుండును. జొన్నలు, గోధుమలు ఇచ్చటి నేలలలో పండునట్టి ముఖ్యమైన పంటలు. గాలి తూర్పువైపుగా, ఉత్తర చైనా మైదానము మీదికి లోయసును (Loess) ను గొని వచ్చును. ఏంగ్ టీజ్ కెంగు లేక యాంగ్ టీజ్ నది (Yangtze River) ఈ వసుపుపచ్చని వండలి మట్టిని సముద్రమునకు చేర్చును. ఇంకను ఆవల ఉత్తరమున హోయాంగ్ హో (Howang Ho) లేక ఎల్లో నది (Yellow River) పసుపు పచ్చని వండలి మట్టిని సముద్రమునకు చేర్చును. ఈ రెండు నదుల మూలముననే నిరంతరాభివృద్ధి చెందుచున్న ఉత్తర చైనా మైదానము ఏర్పడినది. ఈ మైదానములో దాదాపు చెట్లు చేమలు లేవు. ఇచ్చట హెచ్చుగా కాపులు సేద్యము చేయుచుందురు. సేద్యపు భూమి కొద్ది కొద్ది భాగములు రైతు క్రింద నుండును. ఆ క్షేత్రములందు జొన్న, గోధుమ, సోయాచిక్కుళ్ళు పండించ బడును. రెండు ప్రచండ పర్వతము మైదానముపై ఎత్తుగ ఏర్పడియున్నవి. ఎత్తయి, శిలామయమైన షాంటుంగ్ (Shantung) ద్వీపకల్పము తూర్పువైపు ఎల్లో నదిలోనికి చొచ్చుకొనిపోయి యున్నది. మరియు నైరృతి దిశ యందు (South West), లాప్ లే (laple) చే వ్యాప్తమయిన మైదానమునకు (ఈ మైదానమునకు సెంట్రల్ బేసిన్ ఆఫ్ చైనా అని పేరు.) ఉత్తరముగా క్వైయాంగ్ షాన్ (Kwaiyang-Shan) ప్రాగ్దక్షిణ దిశలకు వంపు కలిగియున్నది. ఉత్తర చైనా వర్షాభావముచే ఎండిగాని, చలిచే తెల్లబారి కాంతివిహీనమైగాని ఉండును. దక్షిణ చైనా, వర్షపాత సమృద్ధియు, ఉష్ణతరమయిన శీతోష్ణస్థితియు కారణములుగా, సంవత్సరము పొడుగునను జలభరితమై సస్యశ్యామలమై ఒప్పారుచుండును. దక్షిణ చైనాలో విశేష ప్రాంతము పర్వత మయమైనదిగా నున్నది. యాంగ్సీ (Yongtze) నది నీటిపారుదల గల గొప్ప పరివాహ ప్రదేశములును, కాంటను నందలి చిన్న డెల్టా భాగమును, ఇందలి ప్రధాన నిమ్న ప్రదేశములు (low lands). నదీ లోయ లోని సన్నని నడవల మూలమున మూడు యాంగ్సీ పరీవాహ ప్రదేశములు (Basins) ను పరస్పరముగా ప్రత్యేకింపబడి యున్నవి. క్రిందిభాగమున నున్న పరివాహ ప్రదేశము (Basin) ఒక డెల్టాగాఏర్పడి హోయాంగ్ హో పరీవాహ ప్రదేశముతో కలిసి పోవుచున్నది. మధ్యభాగమున నున్న పరివాహప్రదేశము (Basin) అదేవిధముగ అనేక నదుల వండలిచే ఏర్పడియున్నది. మూడవ పరీవాహప్రదేశము (Basin) లేక ఎఱ్ఱమడుగు, నదికి ఎగువను గలదు. అది, మధ్య పరీవాహ ప్రదేశమునుండి పర్వతభిత్తిచే వేరు చేయబడినది. ఈ భిత్తియందు నదీమూలమున ఒక సన్నని గండి ఏర్పడినది. అడుగునను, నడుమను గల పరివాహ ప్రదేశముకంటె, రెడ్ పరీవాహ ప్రదేశము ఎన్ని యో అడుగుల ఎత్తున నున్నది. అది చిన్న కొండలతోను, చిన్న చిన్న పరీవాహ ప్రదేశముల తోను అలరారుచున్నది. ఈ గుట్టల మధ్యనే, సారవంతమైన చెంగ్‌టూ (Chengtu) మైదాన మొకటి గలదు.
యాంగ్సీ పరీవాహప్రదేశము లుత్తరచైనానుండి అనేకములయిన కట్టల కలయికచే ప్రత్యేకింపబడినవి. అనేక నదులయొక్క ఈశాన్యభాగమున ఎత్తైన డెల్టా భూముల సముదాయములు విశేషమైన ఆటంకముగా నేర్పడినవి. పశ్చిమ దిశయొక్క ఎగువభాగమున మొదట ఒక పర్వతశ్రేణియు, పిదప చిన్‌లింగ్ పర్వతములును (ఇవి క్రమముగా 10,000 అడుగుల ఎత్తునకు మించి యున్నవి.) సరిహద్దు మండలమునకు గురుతులుగా నున్నవి. ఈ ఆటంకములను అనేక స్థలములలో, కాలిబాటలచే జనులు దాటుచున్నారు. సైనికులకును, వర్తకుల
759