Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/806

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చైనా చిత్రకళ సంగ్రహ ఆంధ్ర


చైనాయందు హాన్ రాజవంశ కాలము (Han Dynasty) నుండి గొప్ప ఎత్తున పచ్చిగచ్చుపై చిత్ర రచన (Fresco Painting) అభ్యసింప బడెను. బౌద్ధము ఆరంభమైనది మొదలుకొని ఈ కళకొక నూతన ఉత్తే జము (Impetus) చేకూ రెను. కాని వస్తుతః కళాఖండ మెద్దియు సంరక్షితము కావింపబడి యుండ లేదు. కాని వాటికి ప్రతులుగా చెక్కబడిన ఖననక్రియా శిలాఫలక ముల వలన, మనకు ఆ పచ్చిగచ్చు చిత్రలేఖనములను గూర్చి కొంత తెలియు చున్నది. ఈ ప్రతి ప్రకాశ చిత్రము లలో (Silhouettes) నొక చిత్తోన్మాద కరశక్తి కలదు.

చైనీయులు తమ కళాకారులను గూర్చియు, వారి రచనలను గూర్చియు వృత్తాంతములను శతాబ్దముల తర బడిగా వ్రాసి పెట్టి యుంచినారు. కాని వాటిలో నొక్కటి యైనను నిలిచియుండలేదు. కు- కై - చై (Ku.Kai- కై -చై Chai) చిత్ర లేఖనము ఒకటి లండనులో బ్రిటిషు మ్యూజి యమున నున్నది. అది క్రీ. శ. నాలుగవ శతాబ్దికి చెందిన కళాకారుని రచనకు ప్రతిగానున్నది. అది తాంగ్ యుగ మునకు (Tong period) చెందినదై యున్నది. దానిని బట్టి అప్పటికే చైనా కళ రూపొందియున్నట్లు తెలియు చున్నది.

తాంగ్ యుగములోనే (క్రీ.శ. 618-906) చైనా చిత్రకళ ఒక కళగా రూపొందినది. అప్పుడే చైనా కవిత గూడ రూపొం దెను. చైనా కళకును, చైనా కవితకును సన్నిహితమయిన సంబంధము కలదు. ఈ యుగపు చిత్ర కళాఖండములలో గూడ స్వల్ప సంఖ్యాకములే నిలిచి యున్నవి. ఈ కాలమున ప్రప్రథమముగా పర్వతములు, వృక్షములు, జలపాతములు మొదలగు వాటిని (Moods and atmospheres) చిత్రకళా ఖండములను సృజించు టకై ఉపయోగించిరి. లిస్యు హసన్ (Lissu-hseen) అను నాతడును, కవియు, చిత్రకారుడు నైన వాంగ్ వేయ్ (Wangwei) అను నాతడును ఈ జాతి చిత్రకళా కారులలో ప్రవీణులుగా నెన్నబడిరి. అయితే యథార్థ ముగా వారివని చెప్పబడు కృతు లెవ్వియు నిలిచియుండ లేదు. ఈ కాలపు కళాకారులు ఒక నియతమయిన సంజే పవర్ణనముచే దృష్టిగోచర ప్రదేశ చిత్రములను (Landscapes), బొమ్మల చిత్రములను చిత్రించు విషయమున అవలంబింప దగిన స్వరూపములను నిర్వచింపదలచి నట్లు కనిపింతురు. వారు జీవించియున్న యుగపు వాస్తవి కతాదృష్టిని (Realistic outlook) బట్టి చూడ అది సంభావ్యమే అగుచున్నది.

సంగ్ యుగమున (క్రీ. శ. 960-1279) టోయిస్ట్, జెన్ (Toaist and Zen mystics) అను గూఢ తత్వ జ్ఞుల ప్రభావముచే దృష్టిగోచర ప్రదేశ చిత్రణము (Landscape) ఆధ్యాత్మిక తత్త్వబద్ధ మయ్యెను. ఈ తాత్త్విక తాముద్ర కవితపై గూడ పడెను. ఇందు కళా కారులు సహజా వేశముతో తమ మనో వృత్తులను ఆవిష్క రింప యత్నించిరి. వారు సమకాలిక వేదాంతము ననుస రించి ప్రపంచ దృష్ట్యా సకల వస్తు ప్రపంచము అనిత్యత్వ ముగా భావింప దొడగిరి. అంత కళాకారులు దృష్టి గోచరములగు పర్వత ప్రదేశ రంగములను (Landscape of mountains), జల ప్రదేశ రంగములను చిత్రించ దొడగిరి. అట్టి చిత్రము లందు పొగమంచులో మగ్న మయిన ఆకృతులు (Mist drenched forms) కన నగును. ఆయాకృతులు అంతరించుచున్న ప్రపంచము నకు సంబంధించినవా అని యనిపించుచుండెను. కాకె మానోస్ (Kakemonos) అను చిత్ర పటములలో అంతరువులు ఒక దానిపై నొకటి గోచరించు నట్లుగా ఏర్పరచబడును. అందుచే నవి నొక దానిపై నొకటి యున్నట్లు కాన్పించును. ప్రదేశ చిత్రమును పూర్తిగా నాకళించినచో చిత్రకారుడు అత్యున్నత స్థానము నుండి ఆ రంగమును దర్శించినట్లు తోచును. ధ్యానమగ్ను డయిన ఒంటరి బాటసారి వంటి అల్పవ్యక్తులను చిత్రిం చుట చిత్రకారులకు అభీష్టములైన విషయములయ్యెను. ఎల్ల సృష్టిలో భగవంతుడున్నాడు. పొగమంచులో వంగిన శాఖా పుష్పములపై వ్రాలిన సీతాకోక చిలుక, మురి కిలో పడియున్న బిచ్చగాడు - అందరును బుద్ధావ తారు లే అని హిషియకుయ్ (Hsiakuei) అను చిత్రకారుడు వచిం చెను. సంగ్ (Sung) కాలమునాటి దృగ్గోచర ప్రదేశ చిత్రములలో ముందు భాగమున ఒక చెట్టు రూపము ఉండును. అదియొక వికృత, విరూప రేఖా చిత్రము. ఆచెట్టు (చిత్రము 215) దుష్టచర్యా ఫలితమునకు సంకే తము. చిత్రకారులు ఆధ్యాత్మిక భావమును చిత్రించుటకు