Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చైతన్య మహాప్రభువు 736 సంగ్రహ ఆంధ్ర

గ్రంధి వాచి నొప్పిగా నుండును. పెన్సిలిన్ కాని, సల్ఫా ఔషధములను కాని, ఉపయోగించిన యెడల వెంటనే గుణము కనబడును. రొంప, విషపైత్యజ్వరము లేక పొంగు వచ్చినచో, గొంతునందు సంపర్క దోషము కల్గి ఉపజిహ్వికులు వాచుట సామాన్యముగా జరుగును.

క్విన్సీ : ఈ పరిస్థితియందు ఒక ఉపజిహ్విక చుట్టును చీము పట్టును; ఒక ఉపజిహ్విక వాచి, నొప్పికల్గి జ్వరము వచ్చును. అది పెన్సిలి వాడినచో నయము కావచ్చును. లేదా రంధ్రముచేసి చీమును తొలగించ వలసి యుండును. ఈపరిస్థితి పదేపదే వచ్చునది కావున, ఉపజిహ్విక లను ఆరు వారముల తరువాత లాగివై తురు.

దీర్ఘకాలికమైన ఉపజిహ్విక వ్యాధి : ఈ పరిస్థితిలో ఉప జిహ్వికలు వాచి, రోగికి గొంతునొప్పి పదేపదే కలుగు చుండును. ఒక్కొక్కప్పుడు ప్రతి ఉపజిహ్విక మీదను తెల్లని మచ్చలు గోచరించును. అవి నొక్కినచో చీము వచ్చును. అట్టి ఉపజిహ్వికలను తీసి వేయవలెను.

ఘటసర్పి వ్యాధివచ్చినపుడు దానితోపాటు సామాన్య ముగా ఉపజిహ్విక సంపర్క దోషమునకు గురి యగును. ఉపజిహ్విక మీది పై భాగము (patch) తెల్ల పడి గట్టిగా పట్టుకొనియుండును. కొంచెము ముక్కను తీసికొని పరి క్షించిన యెడల, ఘటసర్పి (డెప్తిరియా) క్రిములు గోచ రించును. డెప్తిరియాకు చేసిన మాదిరిగానే చికిత్స చేయవలెను.

సవాయి వ్యాధి ద్వితీయ దశలో నున్నప్పుడు ఉప జిహ్విక పై మరకలు (పాచెస్) గోచరించును. తదుపరి ఉపజిహ్విక వాయవచ్చును. ఉపజిహ్విక వాచినప్పుడు, అది వండిన మాంసపు ముద్దవలె గోచరించును. సవాయికి చేసిన చికిత్సనే చేసిన యెడల ఈ పరిస్థితి సత్వరముగా నయమగును.

ఉపజిహ్వికా వ్యాధి వచ్చిన మూడు వారముల తర్వాత కీళ్ళవాతము, లేక తీవ్రమైన మూత్రపిండపువాపు సంభ వించుట సామాన్యముగా జరుగును. ఇట్టి పరిస్థితులలో పదేపదే మరల రాకుండా ఉపజిహ్వికలను తీసి వేయవలసిన పరిస్థితి ఏర్పడ వచ్చును. రోగప్రకోపము తీవ్రముగా నున్నపుడు ఉపజిహ్వికను తీసివేయకూడ దని భావింపబడు చున్నది. రోగము ఉపశమించిన తర్వాత నే ఉపజిహ్వికలను తీసివేయవచ్చును. కాని ఈ రోగమును నిరోధించుటకు గొంతునొప్పి రాగానే పెన్సిలిన్ మోతాదులను పదేపదే ఇచ్చెదరు.

కె. శే.


చైతన్య మహాప్రభువు :

హిందూ దేశములో మధ్యయుగపు మహా సాధుపుంగవు లలో, మహాథ క్తులలో శ్రీ చైతన్య మహాప్రభువు మిగుల ప్రసిద్ధిచెంది యున్నాడు. ఈతని అసలు పేరు విశ్వంభరుడు. ఈతని తండ్రి జగన్నాథ మిశ్రుడు. తల్లి పేరు శచీదేవి. విశ్వంభరుని మనోహర శరీరచ్ఛాయను బట్టి ఇతనికి గౌరాంగు డను పేరు కూడ కలిగెను. తల్లి పెట్టుకొనిన ముద్దు పేరు 'నిమాయి'. ఈతడు తురీయాశ్రమమును. గై కొనినప్పుడు "శ్రీకృష్ణ చైతన్య భారతి" అను నామ మును వహించెను.

క్రీ. శ. 1488 ఫిబ్రవరి నెలలో పశ్చిమ బెంగాలులోని నవద్వీప నగరమందు ఈతడు జన్మించెను. అచ్చటి శాస్త్ర పాఠశాలలో విద్యాభ్యాసము చేసి పదు నెనిమిది సంవత్సర ముల ప్రాయమున నే బంగాళాదేశమున గొప్ప విద్వాంసు డని ప్రసిద్ధి చెందెను. వేద వేదాంగములు, తర్క వ్యాకర ణాది విద్యలందు ప్రౌఢుడయి యుం డెను. ఇపుడు విశ్వం భగుడు గురువులకు గురువు. తండ్రి చనిపోయిన పిమ్మట ఇతడే ఒక శాస్త్ర పాఠశాలను స్థాపించి, అందు ఉపా ధ్యాయు డయ్యెను. ఉద్దండ పండితులను సృష్టించెను, ఇతనికి రెండుసార్లు వివాహ మయ్యెను. మొదటి భార్య గతించగా ఇతడు ద్వితీయ కళత్రమును గైకొ నెను .

22 ఏండ్ల వయస్సులో నున్నపుడు తన పితృపాదులకు పిండప్రదాన కర్మ జరుపుటకై విశ్వంభరుడు గయా క్షేత్రమునకు వెడలెను. అచ్చట స్వామి "ఈశ్వరపురి" అను మహనీయునితో ఇతనికి పరిచయము కలిగెను. ఆ పరివ్రాజకు డీతనికి దశాక్షర పరిమితమగు 'గోపాల మంత్రము'ను ఉపదేశము చేసెను. ఈ సంఘటనము ఈతని జీవిత విధానము నంతయు మార్చివేసెను. ఆనాటినుండి విశ్వంభరుడు భగవద్భక్తి పరుడై, భగవద్దర్శన వ్యసనిగా మారసాగెను. ఇతడు దివ్యవిద్యా సంకలితుడై భావోద్రే కానుభూతులను పొంది కృష్ణ నామమును పదేపదే జపించు చుండెడివాడు.“హరిబోలో " అనుచు, నవ్వుచు, ఏడ్చుచు,