Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/795

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3 చెవి-ముక్కు-గొంతు


తలతిరుగుట : (వెర్టిగో): తలతిరుగుట లేక ఒక వ్యక్తి నిలబడి యున్నపుడు ఒక వై పుకు పడిపోవుచున్న ట్లనిపించు టను వెర్టిగో అందురు. ఈ వ్యాధితో పాటుగా సాధారణ ముగా చెవిలో హోరువ్యాధి వచ్చుచుండును. లోపలి చెవిలోని వెస్టెబ్యులర్ భాగము పని చేయక పోవుటయే ఇందులకు గల కారణము.

తిరుగుడు కుర్చీలలో కూర్చుని తిరిగి నప్పుడును, లేక మిక్కిలి చల్లనైన నీరు మన చెవిలోనికి పిచికారి కొట్టి నపుడును, మనకు తల తిరుగుచున్నట్లు (తలదిమ్ము) అని పించుట జరుగును. వాంతులు కూడా రావచ్చును. కుహ రికా యంత్రములు పూర్తిగా నశించని యెడల ఇట్టిది సంభవించదు.

చెవి లోపల భాగమునకు సంబంధించిన తల తిరుగుడు 40 సంవత్సరములు దాటిన వారికి మాత్రమే వచ్చును. అది నాలుగు రోజుల కన్న ఎక్కువ కాల ముండదు. ఇట్లు వచ్చుటకు పూర్వము రోగి స్వస్థతగా నుండును. రోగికి తలదిమ్ము, తలతిరుగుట, తరచుగా చెవిలో హోరు శబ్దము కలుగును. కొద్ది మోతాదులలో ఫెనో బార్బి టోన్ ఇచ్చిన యెడల రోగికి స్వస్థత కలుగును. అట్టి తీవ్ర మైన కేసులలో కుహరికా యంత్రములను శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా తీసి వేయ వలసియుండును. అట్లు చేసి నచో వినికిడి శక్తి కూడా పోవును.

విమానయానము : సాధారణముగా మధ్య చెవియొక్క లోపలి భాగము లోని గాలి ఒ త్తిడియు, బయటనున్న గాలి ఒ త్తడియు గొంతులోనికి తెరుచుకొని యుండు యుట్టేసి యన్ ట్యూబ్ ద్వారా ఒకే స్థాయిలో నుండును. మనము పైకి పోయిన కొలదియు, ఎత్తు నుండి క్రిందికి దిగిన కొల దియు గాలి ఒత్తిడిలో మార్పులు కలుగుచునే యుండును. ఆ ఒత్తిడులను సమపరచుటకు వ్యక్తి తరచుగా మ్రింగు చుండవలెను. అట్లు చేసిన యెడల కంఠ కర్ణ నాళముల ద్వారా ఒత్తిడి సమాన మగును. లేనిచో మధ్య తీవ్ర మగు నొప్పి రావచ్చును.

మానవుల వినికిడి శక్తి : 10–20,000 సైకిల్సు వరకు శబ్దములను మనము వినగలము ; దీనిని మించి మనము విన జాలము. జంతువులు, అందులో ముఖ్యముగా కుక్క ఈ పరిమితిని దాటి విన కలుగు చున్నది. 733 వీటి ముక్కు ముక్కు

రెండు పుటములుగా విభజింపబడినది. మధ్య ఒక గోడ యుండును. అది కొంత వరకు తరుణాస్థులతోను, కొంతవరకు ఎముకలతోను నిర్మి తము. ముక్కు ప్రారంభ భాగములో వెంట్రుక లుండి దానిని సంరక్షించును. అవి గాలిని వడగట్టును. బయటి గోడలు మధ్యకు ముడుచుకొని యుండును. వాటిలో పల ఒక పొరవంటిది యుండును. ముక్కు పై భాగము మెదడు నుండి ఒక పలుచని యెముకల పళ్ళెరముతో వేరుచేయ బడినది. మొదటి నాడి పై నుండి వచ్చును. వాసనకు కారణ మిదియే. ముక్కు వెనుకటి భాగము సప్తపదికి దారితీయును. ముక్కు చుట్టును గల ఎముకలు లోపల గుల్లగా నుండును. వాటి చుట్టును పొర యుండును. ఇవి గాలితో నిండి యుండును. వీటినే సైనసిస్ అందురు. నుదుటి ఎముకలో రెండు సైనస్ లు ఉండును. ముక్కుకు ఇరుప్రక్కల గల మాగ్జిలరీ సైనస్ లపై నుండి స్పినోయిడల్ సైనస్, ఎథి మోయిడల్ ఎముకల నుండి చిన్న సైనస్ లు

చిత్రము - 212 3 పటము - 3

ముక్కు

ముక్కును మధ్య గోడ మీదుగా కోసిన యెడల మనకు కనబడుభాగము : 1. ముందువైపున గల నైనన్. 2. తరుణాస్థులతో తయారైన గోడ. 3. వాసనను స్వీకరించు మొదటి నాడి.