Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/754

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రలేపనసామగ్రి సంగ్రహ ఆంధ్ర

(source of origin) అనుసరించి ఈ క్రింది తరగతుల క్రింద విభజింపబడును.

1. లోహవర్ణములు (mineral colours); 2. రసా యన వర్ణములు (chemical colours); 3. సేంద్రియ వర్ణములు (organic colours).

లోహ వర్ణములు (Mineral Colours): ఇవి శిలా రూపములో గాని, మన్నురూపములో గాని లభించును. రంగులు వేయుటకు ఉపయోగించు రీతిగా ఈ పదార్థము మెత్తగా చూర్ణము చేయబడును. వైట్ కాలిన్ (White Kaolin), ఎల్లో ఓకర్ (Yellow Ochre), టెర్రీవర్టీ (Terreverte), బరస్ట్ టింబర్ (Burnt Timber), బరస్ట్ సీన్నా (Burnt Sienna), రా అంబర్ (Raw Umber), రా సీన్నా (Raw Sienna), ఇండియన్ రెడ్ (Indian Red), లాపిస్ - లజూలి (Lapis-Lazuli), మాలకైట్ (Malachite) అనెడి రంగులు ఈ వర్గము లోనివే.

రసాయన వర్ణములు (Chemical colours): ఈ వర్ణ ములు కృత్రిమముగా తయారుచేయబడును. తుత్తు నాగము లేక తెల్ల సీసము (Zinc or lead-white), సిందూరము, (Syngraph) మణిశిల, (Cobalt blue). విరిడియన్ (Viridian), కాడ్ మియమ్ (Cadmium= తగరమువంటి యొక లోహము), అన్రోలిన్ (Avro lin), వెర్డిగ్విస్ (Verdigvis), దంతము (Ivory), దీపపు మసి (Lamp-black) మున్నగు నూతనముగా కనుగొన బడిన పెక్కు వర్ణములు ఈ తరగతికి చెందినవి.


సేంద్రియవర్ణములు (Organic Colours): ఇవి రెండురకములు (1) జంతు సంబంధములు; (2) ఉద్భిజ్జ సంబంధములు.

జంతు సంబంధ ములు : ఇండియన్ ఎల్లో (Indian yellow), కార్మైన్ (Carmine = ఎర్రని చాయ), సెపియా (Sepia=గోధుమరంగు ముద్ద).

ఉద్భిజ్జ సంబంధములు : చిరు వేరును పోలిన వేరు (madders), నీలి (indigo), రేవలచిన్ని వంటి పదార్థము (gamboge). బంగారము, వెండి, తగరము గూడ ఆకు రూపమునను, చూర్ణము రూపమునను రంగులుగా ఉపయోగించబడును.

లోహసంబంధము లైన రంగు పదార్థములు శాశ్వత ముగా నిలిచి యుండగలవు. కాని సేంద్రియవర్ణములు అన్నిటికంటె తక్కువకాలము మన్నును ప్రాచీన కాల ములో ఈ రంగులను కళాకారులో లేక తత్సంబంధీకులో స్వయముగా చేతితో నూరుకొనెడివారు. కాని ఆ పనిని ఈనాడు విశేషాభివృద్ధి చెందిన యంత్రములే చేయు చున్నవి. ఆ దినములలో రంగుచూర్ణమును అవసరమైన ద్రవములలో కళాకారులు కలుపుచుండెడివారు. కాని ఆధునిక కాలమునందు అట్లు కలిపి తయారు చేయబడిన వర్ణములు ట్యూబుల రూపములోను, కణికల రూపము లోను, సీసాల రూపములోను విపణివీథిలో సిద్ధము చేసి అమ్మబడుచున్నవి.

ద్రవరూప సాధనములు (media) : చూర్ణ రూప ములో నుండు రంగులను మిళితము చేయుటకు ద్రవ పదార్థము అవసరము. తైలముతో మిళితమగు వర్ణము తైల వర్ణ మనబడుచున్నది. ఈ విధానమందు సాధారణ ముగా ఉపయోగింపబడు అవిసె నూనెకు అనుగుణ్యముగా రంగుకూడ చిక్కగా మిళితము చేయబడును. "ఎగ్ టెంపీరా” (Egg tempera) అను విధానమునకు గ్రుడ్డు సొన, నీటిరంగులకు తుమ్మబంక (gum arabic), జిగు రుగానుండు గోందుబంక (glue), పాలవిరుగుడు(cascin), సుద్ధరంగులకు (pastels) తుమ్మబంక సాధనములుగా వాడబడుచున్నవి. మైనముగూడ కొందరిచే ఉపయోగింప బడుచున్నది.

ఉపకరణములు (Tools & Equipments) :

పెన్సిలు : గ్రాఫైట్ అను నొక రకపు శిలాసంబంధమైన ఖనిజము పెన్సిళ్లు తయారుచేయుటకు ప్రధాన ద్రవ్యముగా ఉపయోగించ బడుచున్నది. గ్రాఫైటు మెత్తని బంకమన్నులో మిళితము చేయబడును. గ్రాఫైటును అధిక పరిమాణములో బంకమన్నుయందు కలిపినచో పెన్సిలు నల్లగను, మెత్తగను వ్రాయును. మన్ను భాగము ఎక్కువగానున్నచో పెన్సిలు కఠినముగను, గరుకుగను వ్రాయును. ఈ విధానమునందు గ్రాఫైటు రంగు పదార్థముగను, బంకమన్ను రంగును పాక మునకు తెచ్చు సాధనముగను ఉపయోగపడును. ఇట్లు తయారైన పాకమును మెత్తగా నూరి, పిసికి, వండి, సిద్ధముగా నుంచు