Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చికిత్సాశాస్త్రము (వై)

ఇందులకు ఉదాహరణములు. వాటిని ఒకే ఔషధములో కలుపగూడదు.

రాసాయనిక ద్రవ్యములో జీవాణువులను చంపు (కేమో తెరపీ) చికిత్సాశాస్త్రము : శరీరములోని జీవాణువులను చంపినను శరీరమునకు హానిచేయని ఔషధములను కనుగొనుట సాధ్యమే అని ఎర్‌లిక్ అభిప్రాయము. సవాయి రోగమునకు అతడు మొదట సల్వార్ సన్‌ను, ఆ పిమ్మట నియోసల్వార్ సన్‌ను కనుగొనెను. ఈనాడు వాడకములో నున్న రసాయనిక చికిత్సౌషధములు కొన్ని ఈ క్రింద పేర్కొనబడినవి.

విషపాండు జ్వరము (కాలేజరు) వ్యాధికి యూరియా స్టిబమైన్ .

సవాయిరోగమునకు నియోసల్వార్ సన్; చలిజ్వరమునకు మెపాక్రిన్, పాలుడ్రిన్, క్లోరోక్విన్.

ట్రిపనాసోమయాసిస్‌కు ట్రిపార్సమైడ్.

ఆంటీబయటిక్స్ : ఒక వ్యుత్పన్నత (కల్చరు)లో పెన్సిలిన్ నొటేటమ్‌ను ఒక అచ్చులో పోసినయెడల ఆ వ్యుత్పన్నతా మార్గములోనికి పెన్సిలిన్ వ్యాపించి, అందువలన సూక్ష్మజీవుల అభివృద్ధి తీవ్రముగా నివారింప బడునని ఫ్లెమింగ్ కనుగొని యున్నాడు.

సంపర్కదోషములయందు పెన్సిలిన్ చాల ఉపయోగకారి అని కనుగొనబడినది. క్రొత్తక్రొత్త యాంటీబయటిక్సు పెక్కింటిని కనుగొనుచున్నారు. అందు ముఖ్యమైనవి ఈ క్రింద పేర్కొనబడినవి.

క్షయరోగమునకు స్ట్రెప్టోమైసిటిన్, టైఫాయిడునకు క్లోరోమైసిటిన్, టైఫస్ మరియు ఇతర సూక్ష్మజీవులవలన సంక్రమించు సంపర్క దోషములకు ఆరోమైసిన్, టెఱ్ఱామైసిన్.

డిసెంట్రీ మొదలగు వ్యాధులకు బేసిబ్రేసిడ్, క్లోరోమైసిటిన్‌లో అంతర్భాగములను విభజించి దాని స్వరూప సూత్రమును కనుగొని, దానిని ఈ నాడు సమ్మేళన పరచుట జరుగుచున్నది. ఎరిత్రోమైసిన్, పెట్రోమైసిన్, నియోమైసిన్, ఫిలికామైసిన్, పోలీమైసిన్ మొదలగునవి ఈ వర్గమునకు క్రొత్తగా చేర్చబడిన ఔషధములు.

ఇందులో పెన్సిలిన్ మిక్కిలి విశిష్టత గలది. ఎందువల్ల ననగా దీనివలన సాధారణముగా ఎట్టి ప్రకోపనము ఉండదు. అయితే అప్పుడప్పుడు అల్లెర్జీవలన కొందరు మరణించినట్లు తెలియుచున్నది.

వీటి నన్నిటినికూడ విచక్షణా రహితముగా వాడ కూడదు. వాడినచో అవి శరీరజన్య విషకారణములు కాగలవు. ఇవి ప్రేగులపైగల సూక్ష్మజీవులను నాశనముచేసి, తద్వారా 'బి' విటమిన్ లోపమును కలుగచేయును. మధుశిలీంద్రపు క్రిములు హద్దుపద్దులులేకుండ పెరుగును. ఇందువలన కొందరికి సన్నిపాత జ్వరము వచ్చినట్లు తెలియుచున్నది. క్లోరోపిలికా వలన రక్తలోపముకూడ కలుగవచ్చును. పై ఔషధముల వలన పెక్కుమంది ప్రాణములు రక్షింపబడినవి. ట్యుబర్ క్యులర్ మెనంజైటిస్ వలన ఒకప్పుడు ప్రాణాపాయము అనివార్యముగ నుండెను. అయితే వీటిని వాడుటలో జాగ్రత్త అవసరము. ఈ సూక్ష్మజీవులు తొందరగా అదృశ్యమగును. వరుసగా ఆపుచేయకుండా సరిపడిన మోతాదులో ఇయ్యని యెడల అందుకు తట్టుకొనజాలిన సూక్ష్మజీవులు పెరిగి వ్యాధి లక్షణములు తిరుగబెట్టును. అప్పుడు ఈ మందువలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. క్షయ మొదలగు వ్యాధులలో ఇట్టి పరిస్థితిని నివారించుటకు కొన్ని మందులను కలిపి వాడుదురు. ఉదా : స్ట్రెప్టోమైసిన్‌ను అయినెకొటినిక్ ఆసిడ్, హైడ్రొజైడ్ లేక పి. ఎ. యస్, మరియు ఐ. యన్. హెచ్. తో కలిపి ఇచ్చెదరు.

ఈస్టువంటి క్రిములమీద కూడ కొన్ని ఆంటీబయటిక్ ఔషధములు పని చేయుచున్నవి. గ్రీసియో ఫోలిన్ మాత్రలు ఒక నెల రోజులు తీసుకొనిన యెడల తామర తగ్గిపోవును. నిస్టాటిన్, ఈస్టువలను కలుగు వ్యాధులపై పని చేయుచున్నది. తెల్లబట్ట వ్యాధి ఇందులకు ఉదాహరణము.

పెన్సిలిన్‌లు : ఇటీవల పెన్సిలిన్ యొక్క మాలిక్యూలును కనుగొని వివిధరకముల పెన్సిలిన్‌లను తయారు చేయుచున్నారు.

పెన్సిలిన్‌ను మాత్రల రూపములో కూడ తీసుకొన వచ్చును. క్రొత్తగా కనుగొనబడిన నోటిద్వారా ఇచ్చు పెన్సిలిన్‌లు ఇంజక్షనంత సమర్ధతతో పనిచేయుచున్నవి.

బెక్టీరియోఫేజస్ : ఇవి ప్రాణ అణువులు. సూక్ష్మజీవులు బేక్టీరియా, వైరసుల మీద బ్రతుకును. సల్‌ఫా

667