Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చారిత్రక భౌతికవాదము

ముఖ్యముగా జర్మనీదేశమున - భౌతికవాద దృక్పథములో ప్రగతిశీలమైన పరిణామము సంభవించినది. హెగెల్ అను సుప్రసిద్ధ జర్మను తత్వవేత్త భౌతికవాద దృక్పథములో క్రొత్తపుంతలు త్రొక్కి, క్రొత్త పరిశోధనములు జరపి, 'గతితార్కిక భౌతికవాద'మను (dialectical materialism) నూతన సిద్ధాంతమునకు బీజములు నాటెను. ఆతని అనంతరము మార్క్స్, ఎంగెల్స్ అను సుప్రసిద్ధ తాత్త్విక, రాజకీయ, ఆర్థిక వేత్తలు, హెగెల్ ప్రతిపాదించిన 'గతితార్కిక ' సిద్ధాంతములయందు ఇతోధికముగా సుదీర్ఘములైన పరిశోధనములు జరిపి, వాటిని చారిత్రక సంఘటనముల కన్వయించి, పెక్కు రచనలు గావించిరి. ఈ అన్వయ ఫలితముగ, వారి జీవితకాలమునందే, వారు ఆవిష్కరించిన సిద్దాంతములు సశాస్త్రీయము లైనవనియు, ఆచరణయోగ్యము లైనవనియు, అనుభవపూర్వకముగ పెక్కు చారిత్రక సంఘటనముల ద్వారమున నిరూపింపబడెను.

ఇక చారిత్రక భౌతికవాద మన నెట్టిదో తెలిసికొందము.

చరిత్ర అనగా నేమి ? మానవజాతి పరిణామశీలమైనది; నిరంతరము పరివర్తనము చెందునది. ప్రాచీనకాలము నుండియు సామాజిక వ్యవస్థలు ఒకటివెంట మరియొకటి అంతరించినవి. ఇన్నివ్యవస్థలు గడచి మనమీనాడు అధునాతన మైన నాగరిక సమాజములో జీవించుచున్నాము. వెనుకటి తరములవారు బహుశః ఊహించి ఎరుగని విజ్ఞానశాస్త్ర పరిశోధనము లీనాడు శరవేగమున జరుగుచున్నవి. ఈ పరిశోధనముల ఫలితముగా మానవు లీనాడు ఎన్నియో ఐహిక ప్రయోజనములను అనుభవింపగల్గు చున్నారు. పూర్వమెన్నడును కని విని ఎరుగని యాంత్రిక నాగరికత నేడు విశ్వమంతయు నావరించి యున్నది.

అత్యంత ప్రాచీన కాలములో ఆటవికస్థితి యందు ద్రిమ్మరుచుండిన మానవజాతి పెక్కు దశలు దాటి, విశేషానుభవములు గడించి, అత్యంత ఆధునికములైన పరికరములు నిర్మింపగల నవనాగరిక సమాజముగా పరిణామము చెందినది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ క్షేత్రములందేకాక, భావప్రపంచమునకు సంబంధించిన సాహిత్య, సాంస్కృతిక, తాత్విక, నీతిశాస్త్రాది పెక్కు మానవశాస్త్రము లందును మానవుని జీవితదృక్పథము ఊహాతీతమైన పరివర్తనములు చెందుచున్నది.

పరిణామశీలమైన ప్రపంచ చరిత్ర నిర్దిష్టమైన సూత్రముల ననుసరించి నడచుచున్నదా ? లేక దైవికమైన, అనూహ్యమైన కారణములవలన గమించుచున్నదా ? అనెడి ప్రశ్న తాత్వికులైన మేధావులను చాలకాలముగా ఎదుర్కొనుచున్నది. చరిత్రగమనములో జరుగు పరివర్తనములు కేవలము యాదృచ్ఛికములైనవి కావనియు, సహజము, స్వతస్సిద్ధమునైన ప్రకృతి సూత్రముల ననుసరించి ఇవి ఘటిల్లుననియు హెగెల్, మార్క్స్, ఎంగెల్స్ ప్రభృతులు సిద్ధాంతీకరించి యున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్రము, రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము మున్నగు వివిధ శాస్త్రములు పలు సమస్యలను గూర్చి మానవునకు అఖండమైన పరిజ్ఞానము కలుగజేయుచున్నవి. ప్రామాణికములైన విజ్ఞానశాస్త్రములుగా వీటిని పరిగణించుచు వ్యవహారమున నుంచుచున్నాము. అట్లే సమాజపరిణామశాస్త్రము, చరిత్ర, తత్వశాస్త్రము, నీతి శాస్త్రము మున్నగు మానవశాస్త్రములలో (humanities) గూడ ప్రామాణిక మైన విజ్ఞానమును ఆర్జించవచ్చునని నిరూపింపబడినది.

మానవాకృతి భూతలముపై నేర్పడి 5 లక్షల వత్సరములైనట్లు పరిశోధనలవలన అంచనా కట్టబడినది. ఈ మొత్తము కాలములో నాగరికదశ ప్రారంభమై 10 వేల సంవత్సరములు గడచిన వట. యాంత్రిక నాగరికత మొదలై సుమారు నాలుగైదు శతాబ్దులు మాత్రమే జరగినవని తెలియవచ్చుచున్నది. తరువాతి మానవచరిత్రనే మన మీ వ్యాసములో పరిశీలింతము.

ఆదిమ సమాజములో మానవులు సమష్టి కృషితో ఆహారసంపాదనము చేసికొనెడివారు. పరస్పరము వారు గావించుకొనిన సహాయ సహకారములు ఈ కాలమునాటి సాంకేతిక పరిభాషలో “ఆర్థిక సంబంధములు” (Economic relations) లేక “ఉత్పత్తి సంబంధములు" (Relations of Production) అని వ్యవహరింపబడు చున్నవి. అత్యంత ప్రాచీనములైన పరికరములనుండి, అత్యంత అధునాతనములైన యంత్రసాధనములవరకు అన్నింటినీ "ఉత్పత్తి సాధనములు" (Means of Pro-

649