పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము (చరిత్ర) రాణుల వలన ఇరువురు పుత్రులు కలిగిరి. వారిలో ఒకడు 'కలం గై క్కన్నినర్ ముడై చ్చేరళ్' అను నాతడు. రెండవవాడు 'సెంగుట్టవన్' (ధార్మికుడగు కుట్టవన్) అను నాతడు. (సుమారు క్రీ. శ. 180). వీరిలో ‘చేరళ్' అను నాతడు అనేకశత్రువులను జయించి 'అధిరాజ' అను బిరుదములు పొందెను. సెంగుట్టవన్ అను నాతడు కవీశ్వ రు. ఇతనికి 'కడల్ పిరాగ్ ఓట్టియ' (సముద్రమును పారదోలినవాడు) అను బిరుదము కూడ కలదు. ఇతడు నౌకాదళమును, ఏనుగుల యూధమును, అశ్వదళమును పోషించినట్లు తెలియుచున్నది. ఇతడు గొప్ప ఆశ్వికుడై యుండెను. ఈ కుట్టవన్ కాలములో నే పత్నిని ఆరాధించు విధానము. 'సిలప్పాధికారము' నందలి నాయకి యగు 'కన్న' పూజ, తదుపరి కేరళ దేశములో పరిపాటిగా జరుగుచుండు భగవతీ | ప్రార్థన అనునవి అమలులోనికి తేబడెనని తోచుచున్నది. పవిత్రురాలయిన పత్ని లేక 'కన్నగి' యొక్క ప్రతిమను తెచ్చి చెక్కించుటకై హిమా లయ పర్వతములవరకు కుట్టవన్ వెడలి, అచ్చట ఆర్య రాజునుఓడించి, ఒక శిలాఫలక మును తీసికొనివచ్చి, మార్గ మధ్యమున ఆ ఫలక మును గంగాజలములో ముంచి, దానిని చేర రాజ్యమునకు తెచ్చెను. 'పత్ని' యొక్క శిలా విగ్రహ మును చెక్కించి చేరరాజ్యమునకు రాజధానిగా నుండిన తిరువణిక్కులము (అనగా కాంగనూరు) నందు దానిని ప్రతిష్ఠించెను. ఈ ఉత్సవమున సింహళ దేశపు రాజయిన 'గజబాహు’అను నాతడుకూడ ఉండినట్లు తెలియుచున్నది. గజబాహుకాలము క్రీ. శ. 173-195 అని నిర్ణయింపబడి నది. అందుచే కుట్టవన్ క్రీ.శ. రెండవశతాబ్దివాడని తేలు చున్నది. చోళుల వంశములో జరుగుతున్న వారసత్వపు యుద్ధములో ఇతడు కల్పించుకొని తొమ్మిదిమంది రాజు లను సంహరించి, పదవరాజునకు రాజ్యము సంక్రమింప జేసెను. 'పదిట్టపట్టు' (పది పదులు) అను తమిళసంఘ సాహిత్యం సంకలనము ఉదియన్ యొక్క మూడు తరములకు చెందిన ఐదుగురు రాజులను వర్ణించుచున్నది. ఈ వంశపు మరియొక తెగకు చెందిన మరిముగ్గురు రాజులను గురించి కూడ ఇందు వర్ణనము కలదు. కాని ఈ ముగ్గురు రాజుల పరిపాలనములు వంశ పారంపర్యముగ వచ్చినవి కావు.

సంగ్రహ ఆంధ్ర కౌటిల్యుడు వర్ణించిన విధమున, చేర రాజ్యము ఒక భ కుటుంబమునకు చెందిన వివిధ రాజులచే పరిపాలింపబడెను. అదియే 'కులసంఘ' మనబడెను. పద్ధతిలో వంశజు లందరు ఆ రాజ్యములో భాగస్వాము లగుదురు. ఈ విధ మయిన కులసంఘ పరిపాలనము ఆ రోజులలో అమలులో నుండినట్లు తెలియుచున్నది. ఈవిధముగా 'ఆండువన్' అను నతడును అతని పుత్రు డైన 'సేల్ వక్కడంగవాలి ఆడన్' అను నతడును - ఈ ఇరువురును ఉదయన్' యొక్క సంతతిలోని రాజులకు సమకాలికులుగ ఉండి యుండవలయును. ఉభయులును పరాక్రమవంతులును, ఉదారులునై యుండిరి. మహాకవి కపిలారు తన పోషకుడయిన 'పారి' అను నతడు మృతు డయిన తరువాత 'వాలిఆడన్' అనునతని పోషకత్వమున చే రెను. ఆడన్ పుత్రుడయిన 'పెరుముచేరల్ ఇరుమ్పో రై ' (క్రీ. శ. 190) అను నాతడు తాగడూరునకు చెందిన 'ఆది గై మాన్' అను సామంతరాజును ఓడించెను. 'పెరుంసీరల్ ఇరుంపారయి' యొక్క భాగినేయుడొకడు పాండ్యచోళ రాజులను జయించి అయిదుశిలా దుర్గములను స్వాధీన పరచుకొ నెనట. ముగా తెలిసికొనుటకు క్రీ. శ. మూడవ శతాబ్దము తదుపరి చేర పాండ్య రాజుల యుద్ధనై పుణ్యమును గురించియు, ఉత్తరదేశము నుండి వచ్చిన శూరులతో వారు కావించిన పో రాటమును గురించియు, అచ్చటచ్చట ఉల్లేఖింపబడియున్నది. వాస్తవ ముగా చెప్పవలయుననిన కేరళ దేశపు చరిత్రను క్రమ 5 శతాబ్దములవరకు తగినట్టి ఆధారములు లేవు. క్రీ. శ. ఎనిమిదవ శతాబ్దమందు మరల కేరళ చరిత్రయందు ఇరువురు గొప్ప రాజులుద్భవిం చిరి. అందు తై వమతమునకు చెందిన 'చేరమన్ పెరుమాళ్ళు' అను నతడు, వైష్ణవ మతమునకు చెందిన 'కుల శేఖ రాళ్వారు, అను నీ ఇరువురు రాజులును మహోదయ పురము (ప్రస్తుతపు కాంగనూరు)నే రాజధానిగా ఏర్ప రచుకొనిరి. దీనిని విదేశీయులు ముజిరిస్ (Musiris) అని వ్యవహరించుచుండిరి. ఈ చేరరాజులకు 'పెరుమార్ ' అనునది గౌరవనామము. ఈ వంశమునకు చెందిన కులశేఖరుడు కవీశ్వరుడును, మహాభక్తుడునై యుండెను. రామానుజీయ వై ష్ణవులచే