చర్మవ్యాధులు 636 సంగ్రహ ఆంధ్ర
సైకోసిస్ : గడ్డము యొక్క చర్మములోపల, వెంట్రు
కల కుదుళ్ళు, నూనెగ్రంధులలోను 'స్టెఫలకోకై ' అను
సూక్ష్మజీవులవల్ల వచ్చును. ఇవి చీముపట్టి ఉబ్బి పగులును.
జుట్టును పొట్టిగానుంచి పొక్టులను చిదపవలెను. క్వినోలరు
ఆయింట్ మెంటువల్ల తరుచు గుణము కలుగును. పెన్సిలిన్
కూడ మిగుల ఉపయోగకరము. వ్యాధి తిరుగబెట్టుట
సామాన్యముగ జరుగును. కొన్ని కేసులలో టీకాల
మందులు (వాక్సినులు) మంచి ఫలితముల నిచ్చును. రోగి
ఆహారములో చక్కెర తగ్గించవలెను. చక్కెర ఉన్నదో
లేదో తెలుసు కొనుటకు మూత్రపరీక్ష చేయించవలెను.
యాక్నీవల్గారిస్ : ఇది సంపర్కదోషమువలన కలిగిన యెడల దీనిని 'చీరొఫాఫి లెస్' అందురు. ఇది ఒక దీర్ఘ కాలిక వ్యాధి. మొటిమలు గుంపులుగా లేచును. వీటినే 'ఆపిల్ సెల్సు' అందురు. ఇవి ముఖము, రొమ్ముల పై లేచును. ప్రతిరోజు 'బి' విటమిన్ తీసికొనుట అవసరము. చాకొలెట్సును, క్రొవ్వుపదార్థములను విసర్జించవలెను. నంధకముగల మలామాలను వాడవలెను.
ఫింఫిగస్ : ఇది చాల అరుదైనవ్యాధి. బొబ్బలు కన బడి జ్వరము మొదలగునవి వచ్చుట దీని లక్షణములు. ఫింఫిగస్ వల్నారిస్ అనునది దీర్ఘకాలవ్యాధి. ఇందు బొబ్బలు లేచి చిదికి మరల లేచును. ఇది ఒకప్పుడు మరణ హేతు వగును. కార్టిసౌన్, ఎ. సి. టి. హెచ్. వలన సత్ఫలి తములు కలుగుచున్నట్లు తెలియు చున్నది.
ఫరంకిల్: తీవ్రములు మిగులు బాధాకరములు అగు ఎఱ్ఱని మృదువైన పిండములుగల ఒక రకమైన కురుపు. వెంట్రుకల కుదుళ్ళలో ప్రారంభమగును. స్టెప్లోకో కై అను సూక్ష్మజీవులవలన కలుగును. వాపు నెమ్మదిగా తగ్గ వచ్చును. లేక చీము పట్టుటకూడ జరుగవచ్చును. చర్మము పగిలి అందలి మధ్యగల చీము బయటికి వచ్చిన త ర్వాత అది తగ్గిపోవును. ఆంటీ బయటిక్సు (పెన్సిలిన్) ఉపయో తురు. 'కొల్లాయిడల్' మాంగనీస్' రెండు సూదులు ఇచ్చినయెడల క్రొత్తవి పుట్టకుండా చేయును. టీకాల మందును ఉపయోగింతురు. చర్మమునకు సంబంధించిన క్షయ:
లూపస్ వల్గారిస్ : ముఖము ఇందులకు ముఖ్యముగా గురియగును. శరీరములోని ఇతరభాగములు కూడా దీనికి గురికావచ్చును. ముందు ఒక పొక్కుగా ప్రారంభమై, దరిమిలా పుండుగా మారి ఆ పిమ్మట చాలా మెల్లగా మానును. మచ్చపడును. మెడలోని మాంసపు గ్రంధులు వాచి అందుండి చీము కారును. దీనికి క్షయకు చేసిన మాదిరి చికిత్సనే చేయవలయును.
పులిపిరి కాయలు : చర్మము పై పొర పెరిగి పులిపిరి కాయలు ఏర్పడును. ఇది ఒక్కొక్కచోట రసివలనకూడా కలుగవచ్చును. ఇది ఒక్కటిగా కాని పెక్కులుగా కాని రావచ్చును. ఇవి అంటు వ్యాధులు, పులిపిరి కాయలు కోసి నను అవి పెరుగ నారంభించును. విద్యుత్తుతో కాల్చుట ఇందుకు ఉత్తమమార్గము. కార్బన్ డైయాక్సయిడ్ స్నో వాడవచ్చును.
కాయలు (కారన్సు) : తరచుగా కాళ్ళుచేతులలో ఒత్తిడియుండు స్థావరములందు పుట్టును. సరిగా పట్టని జోళ్ళవలన కాళ్ళపై లేచి నొప్పి కలిగించి నడచుట కశ క్తత కలుగజేయును. మృదువైన కాయలకు 20% సాలి సై లిక్ ఆసిడ్ ను కల్లోడిన్ లో కలిపి ప్రతి రాత్రియు రాయవలెను. అట్లు చేయగా మెత్తబడిన పై భాగమును కత్తిరించవలెను. అప్పుడు ఆతొడుగు ఊడిపోయి అవి నివారణమగును. కాయలను ఎంతగా కోసి పై చినను, మూలము ఊడిపోవునంతటి లోతుగా కోసివేయని యెడల ఎట్టి ప్రయోజనము ఉండదు ; అవి తిరిగి పుట్టును.
ఆర్సెనికల్ డర్మటైటిస్: ఆర్సెనిక్ పడని వారికి ఆ యింజక్షన్ ఇచ్చిన యెడల వంటి చర్మమంతయు ఎఱ్ఱ పడి, పొక్కులుగామారి, పొలుసులు క్రింద రాలిపోవును. దీనితో జ్వరముకూడా వచ్చును. జ్వరము ప్రకోపించిన యెడల నూమోనియావల్ల ప్రాణాపాయము కూడ కలుగవచ్చును. ఇది ఆరువారములు మొదలు రెండు నెలలవరకు ఉండును. బి. ఎ. ఎల్. ఇంజెక్ష నులవల్ల ఇందు లకు మంచి ఉపశమనము కలు అవకాశము కలదు.
వ్రణములు (పుండ్లు) : ఇవి చర్మములో ఏర్పడును. అవి పెదవుల చర్మమువంటి సున్నితమయిన చర్మమునకు వచ్చును. లేక తక్కిన శరీరముమీది దళసరి చర్మమునకు వచ్చును.
ఈ క్రింది రకములు సాధారణమైనవి :
1. తీవ్రవ్రణములు: (i) సూక్ష్మజీవులు, (ii) కాలుడు,