Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చర్మవ్యాధులు 634 సంగ్రహ ఆంధ్ర

చేయుదురు. ఇది కొన్ని ప్రత్యేక స్థానములలో కాని శరీరమం దంతటను కాని యుండవచ్చును. పుట్టుక తోడ నే శరీరమం దంతటను బొల్లి యున్నచో దానిని 'ఆల్ చినిజం' అందురు. అట్టి వారు ఎండలో తిరుగరాదు. చలవ కళ్ళ జోడు పెట్టుకొనవలెను.

నేవస్ అనగా పుట్టుమచ్చ; ఇది చర్మపు రక్తనాళములపైన పెరిగియుండవచ్చును.

బట్టతల: మామూలు చర్మముపై వెంట్రుకలు పోవుట వల్ల యేర్పడు సామాన్యపరిస్థితిని 'అల్ పేషియా అరీటా’ అందురు. ఇది కొన్నిమాసము లుండును. తరువాత మరల వెంట్రుకలు పెరుగును. స్పిరిటువంటి వస్తువులను అక్కడ మర్ధన చేసిన యెడల వెంట్రుకలు త్వరగా మొల చును. టైఫాయిడువంటి వ్యాధులు వచ్చినప్పుడు జుట్టు రాలిపోయినను అది మరల పెరుగును. దేలియం అను మందు తీసికొనిన యెడల వెంట్రుకలు రాలిపోవును. 'సుబ్రుసోకా', 'యిక్తోసిస్' వంటి చర్మవ్యాధుల వల్ల వెంట్రుకలు రాలిపోవుట కలదు. రోగి వెంట్రుకలు లేకుండా జన్మించు పరిస్థితిని అలిపేషియా టోటాలిస్ అందురు. 40 సంవత్సరములు పై దాటినవారి కణతలపై వెంట్రుకలు రాలిపోవుట సాధారణముగా కలుగును. ఇట్టిది కొన్ని కుటుంబములలో వంశపారంపర్యముగా వచ్చును.

వెంట్రుకలు నేరయుట: వయస్సు మళ్ళుటకు ఇది ఒక తార్కాణము. మితిమీరిన పని, హటాత్తుగ దుఃఖము సంభవించుట లేక కష్టము కలుగుట వీటివల్ల కూడ ఇది సంభవింపవచ్చును. కొన్ని కుటుంబములలో చిన్నతనము దీనికి లోనే యిది వచ్చును. కి రంగు వేసికొనుటయే మార్గము.

గజ్జికురుపులు : ఇది ఎకారస్ స్కెబియె అను సూక్ష్మ జీవులవల్ల వచ్చును. గజ్జి రసివలన చర్మముపై పొక్కులు లేచి అవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించును. వ్రేలికణుపులు, బొటన వ్రేళ్ళు, స్తనములు, పిరుదులపై ఇవి లేచును. పైన చెప్పబడిన సూక్ష్మజీవి చర్మములో రంధ్రములు చేసికొని దానిలో గ్రుడ్లుపెట్టును. దురద వల్ల రోగి దానిని గోకుట, అందువల్ల చీము పట్టుట సంభ వించును. కుటుంబమంతటికి ఒకేసారి చికిత్స చేయుట, దుప్పట్లు మొదలగునవి ఉడక బెట్టుట అవసరము. బెంజా యిన్ బెంజివేట్ 25% లోషనును ఒంటినిండా పట్టించ వలెను. పెనిసిలిన్ వంటి ఆంటి బయటిక్సును చీముపోవుటకు ఇవ్వవలెను. ఇప్పుడు సల్ఫరు ఆయింట్ మెంటు ఇచ్చుట అరుదు.

పెడీకులోసిస్ (పేలు) : ఇవి మూడు రకములు. (1) నెత్తి, (2) శరీరము, (3) కడుపుపై వెంట్రుకలపై పెరుగునవి. పదేపదే తిరుగబెట్టు జ్వరమును బైఫస్ జ్వరమును ఇవి వ్యాపింప జేయును. ఇది పరస్పర సంపర్కమువల్ల వచ్చును. తల దువ్వి గ్రుడ్లను తీసివేయ వచ్చును. బెంజాయిన్ బెంజివేట్ ఎమల్షను, బెంజీస్ హైడ్రోక్లోరీడ్ 1% సొల్యూషను (లారేక్సేన్) వల్ల వీటిని పోగొట్టవచ్చును.

పనుగుగజ్జి (ఎక్జిమా): శరీరము యొక్క వాపు ఒక ప్పుడు ప్రకోపించును. ఒకప్పుడు దీర్ఘకాలిక వ్యాధిగా నుండును. కొన్ని చెట్లవంటి బాహ్యప్రకోపకారిణులవల్ల గాని, లేక గ్రుడ్లవంటి ఆహారములులేక కొన్ని మందుల వాడకమువల్ల గాని కల్గిన యింద్రియ వికారము మూల మున ఇది సంభవించవచ్చును. దీనికి హైడ్రో కార్టిజోన్ నియోమైసిన్ మలామా వాడవలెను. పిల్లలకు ఇది సాధారణముగా బుగ్గల మీద వచ్చును. దీని నుండి రసి క్రిందికి కారును. ఇందులకు గల కారణములను కనుగొని వాటిని తొలగించుటయే ఇందులకు జరుగవలసిన చికిత్స. వ్యాధి ప్రకోపించినప్పుడు నీళ్ళు తగులకూడదు. కాల మిన్ లోషనును తరుచుగా రాయవలెను. చేనేడ్రల్ యాంటిస్టిక్ వంటి యాంటీహిస్టామిన్ మందులు వాడ వలెను. వ్యాధి వంటబట్టిన కేసులలో పాదరసము కలసిన మలామాలు (ఆయింట్ మెంట్లు) వాడవచ్చును. చర్మ ముపై గరుకుదనము గల మచ్చ లున్న యెడల కొద్ది మోతాదులో ఎక్సు రే చికిత్స ప్రయోజనకరముగా నుండ గలదు.

ఆర్టికేరియా: ఇది ప్రేలుడుజాతికి చెందినది. చర్మము పై వాపు, దురద ఉండును. ఇది దదురరూపములో వచ్చును. పురుగులు కుట్టుట, నరముల బలహీనత, భావోద్రేకము ఉబ్బసము వ్యాధికి సంబంధించిన ఎల్లర్జీ పరిస్థితి, హేజ్వరము గ్రుడ్లు మొదలగు ఆహారపదార్థములు తినుట ఇందులకు