చరకుడు
సంగ్రహ ఆంధ్ర
కాలమువాడే యని నిశ్చయమునకు వచ్చినచో, యాజ్ఞవల్క్యుడు రాజర్షి యగు జనకుని కాలమువాడు. ఆధ్యాత్మిక విద్యాజ్ఞాన ధనియగు ఈ జనకుడు శ్రీరామునకు కన్యాదాత. శ్రీరాముడు త్రేతాయుగ మధ్యభాగమున నున్న వాడు. ఈ త్రేతాయుగము మన వెనుక జనినదే యనుకొనిన, చరకు డి నాటికి ఒకటిన్నర యుగమునకు, అనగా 15 లక్షల 5 వేల 62 సంవత్సరములకు పూర్వ మున్నవాడుగా గ్రహింపవలసి యున్నది.
అగ్ని వేశుడు పునర్వసు - ఆత్రేయమహర్షి శిష్యుడు. ఈ ఆత్రేయుడు భరద్వాజ మహర్షి వలన ఆయుర్వేదమును గ్రహించెను. భరద్వాజుడు ఆయుర్వేదమును ఇంద్రుని నుండి భూలోకమునకు తెచ్చిన ఆదిమహర్షి; వంశకర్త. ఈయనయే శ్రీరాము డరణ్యమునకు బోవునపుడును, భరతుడు రామునికై అరణ్యమునకు బోవునపుడును, రాముడు తిరిగి రాజ్యమునకు వచ్చునపుడును, అరణ్య ద్వారమున మొద లాతిథ్య మిచ్చిన బ్రహ్మర్షి. తనను విడిచి రాము డరణ్యమునకు పోయినది మొదలు తిరిగి తనను చేరువరకు నడచిన మధ్యకాల మందలి చరిత్ర నంతయు రామునకు వినిపించిన దివ్యజ్ఞాన తపస్సంపన్నిధి. ఈ మహామహుని కాలనిర్ణయమునకు ఆదిమ సృష్టికర్తయగు బ్రహ్మవద్దకు వెళ్లవలసియున్నది. ఏలయన, అమృత మధనమువరకు ఆయుర్వేదము భూలోకమున వ్యాప్తికి రాలేదు. అమృతోదయానంతరము, అందరు-అజరామరు రైరి (ముదిమియు, చావును లేనివారు). ఇది బ్రహ్మ ఆదిమ సృష్టికాలము - నూరుకోట్ల యుగముల పురాతన గాథ (గ. పు. మ. ఖం.). తరువాతి కాలమున కశ్యపాది ప్రజాపతుల సృష్టి ఆరంభమై ఆ ప్రజలు ఆధి వ్యాధులకు లోనగుట కారణముగా, ఆనాటి బ్రహ్మర్షి మండలమున తపః ప్రభావ సంపత్తిచే మిన్నయైన భరద్వాజ మహర్షి స్వర్గమునకు వెళ్లి బ్రహ్మాదిగా అశ్వినులవలన ఆయుర్వేదము తెలిసికొని యున్న ఇంద్రునినుండి తా గ్రహించిన ఆయుర్వేదమును భూమండలమునకు తెచ్చి మహర్షి మండలము నందు ఉపదేశించెను. ఆ మహర్షి మండలమందు గల పునర్వసు - ఆత్రేయుడు నిస్సంశయముగా, సాంగముగా, సమగ్రముగా, భరద్వాజునివలన ఆయుర్వేదమును గ్రహించి అగ్ని వేశ, ఖేల, జతూకర్ణ, పరాశర, హారీత, క్షారపాణు లను ఆర్వురు శిష్యులకు బోధించెను. ఈ ఆరుగురును ప్రత్యేకముగ తమతమ పేర్లతో తంత్రములను రచించి తమ గురుకుల మందలి మహర్షి మండలమునందు వినిపించిరి; వారి మెప్పుల నందిరి ప్రచారము గావించిరి. ఇందగ్ని వేశుని మహర్షులు హెచ్చుగా మెచ్చుకొనిరి. ఇది చరకసంహిత యందలి గాథ. దీని ననుసరించి అగ్ని వేశుని కాలనిర్ణయమునకు కోట్ల తరబడిగా గడచిన యుగముల వెంట నడవవలసి యున్నది.
మహాభారతమునందు రెండు సందర్భములలో అగ్నివేశుడు కనబడుచున్నాడు. ఇతడు ఆదిపర్వమున ప్రమద్వర మృతినొందినపుడు భద్రాత్రేయునితో వైద్యుడుగా వచ్చినట్లును, అరణ్యపర్వమున ధర్మరాజు హిమవంతమునకు పోవునపుడు అగ్నిహోత్రములను గొని పౌరోహితుడుగా ముందు నడచినట్లును గలదు. ఈ రెండు పర్యాయములు ఇందు పేర్కొనబడిన అగ్నివేశు డొక్కడే యనినను, వేరువే రనినను అగ్నివేశునికాలము ధర్మజుని కాలమునకు సమముగా నిర్ణయించుట పొసగదు. వైద్యుడు పౌరోహితుడుగా నుండు ప్రాచీనాచార మొకటి కలదు. ఇది ఆయుర్వేద మతమై యున్నది. బ్రహ్మర్షి యగు వసిష్ఠుడు మనువాదిగా సూర్యవంశపు చక్రవర్తులకు గురువుగను, పౌరోహితుడుగను ఉండెను. బ్రహ్మర్షి కాగోరి, తప మాచరించుచున్న రాజర్షి యగు విశ్వామిత్రుడు సశరీర స్వర్గయానమును గోరుచున్న త్రిశంకునకు ఆచార్యత్వము వహించి యజ్ఞము చేయించెను. స్వచ్ఛందవర్తనులగు మహర్షులు వైద్యులుగను, పౌరోహితులుగను, దేశ క్షేమమునకై రాజుల కడనుండి యుండవచ్చును. మహర్షుల చరిత్ర బహువిచిత్ర మైనది. పాండవ పౌరోహిత్యమునకు ధౌమ్యు డంగీకరించి నట్లు పాండవ ప్రార్థితుడై అగ్నివేశుడు రాజ చికిత్సకుడుగా, పౌరోహితుడుగా ధర్మజుని కడ నుండిన నుండవచ్చును గాని, అది కారణముగా అగ్ని వేశుని కాలము ధర్మజుని కాలమునకు దించుటకు వీలుచాలదు.
ధర్మజుడు పట్టాభిషిక్తుడై 36 సంవత్సరములు రాజ్యపాలన మొనర్చెను. ధర్మజుని పూర్ణాయువు 128 సంవత్సరములు. ఈ కాలము ద్వాపరాంతమును, కలియుగారంభమునై యున్నది. కలి గతాబ్దము లిప్పటికి 5 వేల 62
618