చంపూకావ్యములు (సంస్కృతము)
సంగ్రహ ఆంధ్ర
ఉచ్చైర్గతిర్జగతి సిధ్యతి ధర్మత శ్చే
త్తస్య ప్రమా చ వచనైః కృతకేతరై శ్చేత్
తేషాంప్రకాశనదశా౽పి మహీసురై శ్చే
త్తానంతరేణ నిపతేత్క్వను మత్ప్రణామతిః
అను శ్లోకమునందలి మంగళా చరణము నమస్క్రియా రూపమై, ధర్మబోధకమై, భోజుని వినయసంపత్తికిని, బ్రాహ్మణ భక్తికిని, చిహ్నముగ వరలుచున్నది. ఇందారు కాండములు కలవు. వీటిలో భోజుడు రచించినవి మొదటి అయిదు కాండములే. యుద్ధకాండమును లక్ష్మణకవి, ఘనశ్యాముడు, రాజచూడామణి దీక్షితులు, అను పండిత వర్యులు పూరించిరి. ఈ చంపువునందు మహాకవి అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులు, సరసకల్పనా స్వాతంత్ర్యము, రసోచిత వర్ణనకౌశల్యము, భాషా విభుత్వము, భావపరిపాకము, పాత్రపోషణ చాతురి, భావబోధక మితపద ప్రయోగనైపుణ్యము ప్రస్ఫుటముగ భాసించినవి. శైలి రసోదాత్తము. భరద్వాజ, అగస్త్య మహర్షి ప్రభృతుల ఆశ్రమముల మహిమను, ఋతువుల సౌందర్యమును, గంగావతరణ భవ్యతను భోజుడు వర్ణించిన విధ మనితరతుల్యము. శ్రీరాముడు వర్ణించిన వర్షా సమయ ప్రభావవర్ణన మెంతయు మనోహరము. ఉదా.
అయం కాలః కాలప్రమథనగళాభైరభినవైః
అహంయూనాం యూనామపహరతిధైర్యంజలధరైః
స్మరాధారా ధారాపరిచయజడా వాంతి సహసా
నభస్వంతః స్వంతః కథమివ వియోగః పరిణమేత్ .
మహాసమరసూచకః ప్రతిదిశం మనోజన్మనో
మయూరగళ కాహళీక లకలః సముజ్జృంభతే
పయోదమలినే దినే పరుష విప్రయోగవ్యథాం
నరేషు, వనితాను వా, దధతి హంత ! కే, కా, ఇతి.
అంభోధరోదర వినిర్గతవారిధారా
సంమర్ద మాంసలసమీరసమీర్య మాణైః,
ఆమోదవీచినిచయైః కుటజప్రసూనై :
ఆకాశమేత దవకాశవిహీన మాసీత్,
ఘనశ్యామలపత్రస్య వ్యోమన్యగ్రోధ శాఖినః
ప్రరోహా ఇవ లక్ష్యంతే వారిధారా ధరా౦గతాః.
ఈ కావ్యమునకు వెలసిన పెక్కు వ్యాఖ్యలు దీని మహత్త్వమునకు నిదర్శనములుగ నున్నవి. భగవంతరాయడు, రాఘవుడు, వేంకటకృష్ణకవి అనువారు ఉత్తరరామాయణ కథను, ఉత్తర చంపువులుగా వ్రాసిరి. ఇవి ఆముద్రితములని తెలియుచున్నది. వెంకయ్యసూరి 'కుశలవచంపువు'ను, రామచంద్రుడు 'రామచంద్ర చంపువు' ను, గుండు రామస్వామిశాస్త్రి 'సీతా చంపువు' ను రచించినట్లు తెలియు చున్నది.
భాగవత చంపువులు : భాగవత కథ నాశ్రయించి రచింపబబడిన చంపువులు పేర్కొనదగినవి. అభినవ కాళిదాసు (క్రీ. శ. 1051) ఆరు ఆశ్వాసముల భాగవత చంపువును నిర్మించెను. ఈ కావ్యారంభమునందలి
"కల్యాణం నః ప్రభూతం కలయతు
లలితాలాప శైలేశ బాలా
లీలా జాలానుకూలా శిశిరకర
కలా భానుమాలా జటాలా
ఏషా శేషాహిభూషా పరిక లిత
సుధాపూరధారానుకారా
భద్రా ముద్రా వినిద్రా పురహరణ
విధౌ కా౽పికారుణ్యపూర్ణా"
అను శ్లోకమున కవికి పార్వతియందు గల భక్తి సూచితమైనది. అభినవ కాళిదాసు అను బిరుదమును ధరించిన వారు పెక్కురుకలరు. ఈ కవి పేరు తెలియదు. చిదంబర కవి (క్రీ.శ. 1600), రాజనాథకవి, రామభద్రకవి అను పండితులు రచించిన భాగవత చంపువులు మనోజ్ఞములు. వీటికి వ్యాప్తి తక్కువగ నున్నది. అవసరాల పద్మరాజు (క్రీ. శ. 1800) 'బాలభాగవత' మను భాగవత చంపువును నిర్మించెను. ఇత డాంధ్ర బ్రాహ్మణుడు. 'బాలభాగవతము' నకు 'పద్మరాజ చంపు' వను నామము సుప్రసిద్ధము. ఇందలి వచనము సానుప్రాసము, మధురము. కొల్లూరి రాజశేఖరుని భాగవత చంపువు కృష్ణకథాత్మకము. ఈ కవి పేరూరునందు నివసించెనని తెలియుచున్నది.
చరిత్రాత్మక చంపువులు కొన్ని వెలసినవి. క్రీ.శ. 1240 వ సంవత్సర ప్రాంతమువాడైన సోమేశ్వరదేవుడు 'కీర్తి కౌముది' అను కావ్యమును వ్రాసెను. ఇది చంపూ శైలిలో నున్నది. వీరధవళుని మంత్రి యగు వస్తుపాలుని
586