విజ్ఞానకోశము - 3
ఘర్మయంత్రములు
మరియు R=Cp
____ Cv
Cp = స్థిరపీడనమువద్ద వాయువుయొక్క విశిష్టోష్ణము.
Cv= స్థిరఘనపరిమాణమువద్ద వాయువు యొక్క విశిష్టోష్ణము.
ఈ సూత్రము నుపయోగించి యంత్రసామర్థ్యమును గణించిన కార్నోయంత్రపు సామర్థ్యము 83 శాతమనియు ఆటోయంత్రపు సామర్థ్యము 44 శాతమనియు, డీసెల్ యంత్రపు సామర్థ్యము 63 శాతమనియు తేలును.
డీసెల్ ఇంజనుల సామర్థ్యము ఆటో ఇంజనుల సామర్థ్యముకంటె ఎక్కువ. డీసెల్ ఇంజనులలో ఆటో ఇంజనులోకంటె తక్కువ ఇంధనము ఖర్చగును. కాని డీసెల్ ఇంజనులో గరిష్ఠపీడనము 35 వాతావరణముల (atmospheres) వరకు వుండుటవలన, దాని స్థూపము యొక్క గోడలు ఎక్కువ మందముగా నుండవలెను. మొత్తముమీద డీసెల్ ఇంజనులు ఆటో ఇంజనులపై నిశ్చయమైన అభివృద్ధి అని చెప్పవచ్చును.
గడచిన ఏబది సంవత్సరములలో అంతర్జ్వలన యంత్రములు బాగుగా అభివృద్ధిచెంది ఆవిరి ఇంజనుల స్థానములో విరివిగా వాడబడుచున్నవి. సాధారణముగా ఆటో ఇంజను కార్లు విమానములలోను, డీసెల్ ఇంజను ఓడలు నడుపుటయందును ఉపయోగింప బడును. కాని ఇటీవల డీసెల్ ఇంజనులు, మోటారు ట్రక్కులను, బస్సులను, రైళ్ళను నడుపుటకుకూడ ఉపయోగించుచున్నారు.
ఆవిరి లేక వాయువు టర్బైనులు (Steam or Gas Turbines): ఇక గాలిమిల్లు (wind mill) రకపు యంత్రములను గూర్చి కొంచెము తెలిసికొందము. 'గాలి మిల్లు' అను పురాతన యంత్రముయొక్క మూల సూత్రమును ఆధారముగా చేసికొని వాయు టర్బైను (gas turbine) అను అధునాతన యంత్రము కనుగొనబడినది. ఎత్తైన ప్రదేశములో ఒక చక్రమును ఉంచినచో, చక్రము యొక్క ఆకులపై (vanes) గాలి ఒత్తిడివలన, చక్రము గాలి వీచినపుడు గిరగిర తిరుగును. ఈచక్రమును మిల్లునకు తగు విధముగా తగిలించుట వలన, చక్రము తిరిగినపుడు మిల్లు పనిచేయుచుండును. గాలి మిల్లును ఉష్ణ యంత్రముగాఎట్లు పరిగణింపవచ్చునను సందేహము మొట్టమొదట కలుగవచ్చును. కాని సూక్ష్మముగా ఆలోచించి చూచిన, గాలి వీచుటకు కారణము భూమి పై భాగములో వివిధప్రదేశములవద్ద ఉష్ణోగ్రతా భిన్నముగా నుండుటయే అని స్పష్టమగును. ఉష్ణోగ్రత విభేదకారణముగా గాలి ఒక చోటి నుండి మరియొక చోటికి వీచును. గాలి తాకిడికి చక్రము గుండ్రముగా తిరుగును. అనగా ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా మారుచున్నదన్నమాట. అందుచే గాలి మిల్లు కూడా ఒకవిధమైన ఉష్ణయంత్రమనియే చెప్పవచ్చును. గాలిమీద ఆధారపడిన యంత్రము మనకు కావలసిన అన్ని వేళలయందును పనిచేయుట సంశయాత్మకము కావున, గాలికిబదులు వాయువును (gas) గాని, నీటి ఆవిరిని (steam) గాని ఉపయోగించి వాయుటర్బైనులు లేక నీటి ఆవిరి టర్బైనులు అను యంత్రములు నిర్మింపబడినవి. మొదటిలో నీటియావిరి (steam) ఎక్కువగా ఉపయోగింపబడినది కాని, అధునాతన యంత్రములలో నీటి ఆవిరికి బదులు అధికపీడనము వద్దనున్న వాయువులు వాడబడుచున్నవి.
చిత్రము - 159
పటము - 12
డీలావల్ టర్బైన్
మొట్టమొదటి ఆవిరి టర్బైనును 'డిలావల్' (Delaval) అనునాతడు నిర్మించెను. 'డీలావల్' టర్బైను 12 వ పటములో చూపబడినది. అధిక ఒత్తిడి వద్దనున్న నీటి ఆవిరి జెట్ (jet) రూపములో స్థిరముగా నున్న రంధ్రముల గుండా టర్బైను బ్లేడుల (Blades of turbine) పైకి చిమ్మును. ఆ జెట్‌యొక్క తాకిడికి టర్బైను బ్లేడులు
561